పెద్ద స్టార్ అయినా ఆ స్నేహాన్ని మరువని బన్నీ
సినిమా పరిశ్రమలో ఒక స్థాయి విజయం సాధించిన తర్వాత వ్యక్తుల ఆలోచనా ధోరణి, చుట్టూ ఉండే పరివారం మారిపోవడం చాలా కామన్ గా చూస్తుంటాం.
సినిమా పరిశ్రమలో ఒక స్థాయి విజయం సాధించిన తర్వాత వ్యక్తుల ఆలోచనా ధోరణి, చుట్టూ ఉండే పరివారం మారిపోవడం చాలా కామన్ గా చూస్తుంటాం. హోదా పెరిగేకొద్దీ పాత పరిచయాలు దూరమవ్వడం, పరిధి పరిమితం కావడం గమనిస్తుంటాం. అయితే, మన టాలీవుడ్ స్టార్స్ లో అల్లు అర్జున్ ను గమనిస్తే ఈ విషయంలో కాస్త ఐకానిక్ స్టైల్ కనిపిస్తుంది.
ఎంత ఎత్తుకు ఎదిగినా తనతో పాటు ప్రయాణించిన మనుషులను పక్కన ఉంచుకోవడం ఆయన స్టైల్. లేటెస్ట్ గా అనౌన్స్ అయిన AA23 ప్రాజెక్ట్ కి సంబంధించిన క్రెడిట్స్ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ట్రేడ్ వర్గాలు గమనించాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు బన్నీ వాస్, సందీప్ రామిశెట్టి, నటరాజ్, స్వాతి అనే నలుగురీ పేర్లు కో ప్రొడ్యూసర్లుగా స్క్రీన్ పై కనిపించాయి. వీరంతా అల్లు అర్జున్ కి ఎప్పటినుంచో ఆప్తులుగా ఉన్న స్నేహితులు.
ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రొడక్షన్ భాగస్వామ్యం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. కేవలం లాభనష్టాల వ్యాపార కోణంలోనే కాకుండా, తనతో కలిసి నడిచిన వారి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు నుంచి, స్టార్‌డమ్ రాకముందు నుంచి తనతో ఉన్న బంధాలకు క్రెడిట్ ఇవ్వడం ఆయన రెగ్యులర్ గా చేసే పనే.
స్కూల్ డేస్ నాటి మిత్రులైనా, కెరీర్ ప్రారంభం నుండి వెంట ఉన్న సహచరులైనా సరే, వారిని తన సక్సెస్ గ్రాఫ్ లో ఏదో ఒక రూపంలో భాగస్వాములను చేయడం అల్లు అర్జున్ లో కనిపించే ప్రత్యేకమైన లక్షణం. ఈ విషయాన్ని ఆయన పెద్దగా బయటకు ప్రచారం చేసుకోకపోయినా, ఆయన ప్రాజెక్ట్‌లు అబ్జర్వ్ చేసేవారికి ఈ విషయం అర్థమవుతుంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ప్రాజెక్ట్‌లను బ్యాలెన్స్ చేస్తూ స్నేహానికి ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తుంటారు.
ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ పాయింట్ హైలెట్ అవుతోంది. ఎంతటి ప్రొఫెషనల్ సక్సెస్ వచ్చినా, తన పాత బంధాలను పక్కన పెట్టేయకుండా వారితో కలిసి ప్రయాణించే తీరు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. ఎంత ఎదిగినా ఒంటరిగా పైన నిలబడటం కంటే, తనతో ఉన్నవారిని కూడా ఆ ఎత్తుకు తీసుకువెళ్లడమే నిజమైన హీరో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కమర్షియల్ మైండ్ సెట్ ఎక్కువగా ఉండే సినిమా ఫీల్డ్ లో ఈ తరహా బంధాలను కాపాడుకోవడం సులభమేమీ కాదు. కానీ, అల్లు అర్జున్ ఆ బ్యాలెన్స్ ని మెయింటెన్ చేస్తూ తన మార్క్ ని చూపిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత లోకేష్ కనగరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.