ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న అఖిల్ రూ.100 కోట్ల మూవీ!
అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్.. గత దశాబ్ద కాలానికి పైగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే .
అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్.. గత దశాబ్ద కాలానికి పైగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే . ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని, ఏజెంట్ సినిమాతో వచ్చి బొక్క బోర్ల పడ్డారు. దాంతో మూడు ఏళ్లపాటు విరామం తీసుకున్న అఖిల్.. ఈసారి 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం థియేటర్ల వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది.
అఖిల్ ఖాతాలో తొలి రూ.100 కోట్ల మూవీ..
ముఖ్యంగా రూ. 100 కోట్లు రాబట్టి అఖిల్ కెరియర్ లోనే తొలిసారి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు అఖిల్ ను రూ.100 కోట్లు రాబట్టిన హీరోల జాబితాలో చేర్చి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మరి ఎప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది? ఏ ఫ్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులో రానుంది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న అఖిల్ లెనిన్..
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం లెనిన్. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సిల్వర్ స్క్రీన్ పై ఊచ కోత కోసిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు నేరుగా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ జీ 5 వేదికగా ఆగస్టు 7వ తేదీ నుండి అధికారికంగా ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
లెనిన్ సినిమా స్టోరీ..
అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 90ల కాలం నాటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం గ్రామం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ప్రతి ఏడాది అక్కడ 18 రోజుల పాటు జరిగే ద్రౌపదమ్మ జాతరలో ఎలాంటి రక్తపు చుక్క చిందకూడదనే కఠినమైన ఆచారం ఉంటుంది. అదే సమయంలో ఆ గ్రామానికి అనాథ అయిన లెనిన్ (అఖిల్) వస్తాడు. ఈశ్వరీ రావు , ఆమె తనయుడు ప్రమోద్ పంజు అతడిని ఆదరిస్తారు. క్రమంగా అఖిల్, ప్రమోద్ స్నేహితులుగా మారుతారు. అదే సమయంలో అఖిల్, భాగ్యశ్రీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. జాతర సమయంలో ఊహించని పరిణామాల మధ్య కథ మలుపు తీసుకుంటుంది. అఖిల్ అనూహ్యంగా జైలు పాలు కావాల్సి వస్తుంది.. అయితే దీనికి కారణం తన స్నేహితుడు ప్రమోద్ పంజు అని తెలుస్తుంది.
ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రమోద్.. లెనిన్ జైలుకు వెళ్లడానికి ఎందుకు కారకుడయ్యాడు? ప్రాణంగా ప్రేమించిన భాగ్యశ్రీ ఏమయింది? లెనిన్ జైలు నుంచి వచ్చాక ముందు ఎవరిని కలిసాడు? ఎవరిపై తన పగను తీర్చుకోవాలి అనుకున్నాడు? ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇలా అనేక ఉత్కంఠ భరితమైన విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. ముఖ్యంగా అఖిల్ తన కెరియర్ లో ఇప్పటి వరకు చేయని రా అండ్ రస్టిక్ పాత్రలో నటించి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆడియన్స్ అందించారని చెప్పాలి. మరి థియేటర్లలో సత్తా చాటి రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఎలాంటి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.