Bigg Boss Telugu 10: అయితే రోహిత్ వైపు, లేదా త్రిగుణ్ వైపు
బిగ్‌బాస్ పదో సీజన్‌లో రోహిత్, త్రిగుణ్‌ల మధ్య రసవత్తకరమైన పోరు సాగుతుంది. ఈ సారి సీజన్ మొత్తం వీళ్లిద్దరి ఆధిపత్యం మీదనే కొనసాగేలా ఉంది.
బిగ్‌బాస్ పదో సీజన్‌లో రోహిత్, త్రిగుణ్‌ల మధ్య రసవత్తకరమైన పోరు సాగుతుంది. ఈ సారి సీజన్ మొత్తం వీళ్లిద్దరి ఆధిపత్యం మీదనే కొనసాగేలా ఉంది. అయితే లైమ్ లైట్‌లోకి రావడానికి మిగిలిన హౌస్‌మేట్స్ కూడా వాళ్ళకి తోచింది చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ ఎదురుగా ఉన్నది కేవలం రెండే రెండు దారులు. మొదటిది రోహిత్ పక్షాన నిలవడం, లేదా రెండు త్రిగుణ్ వెనుక నడవడం. ఈ సూత్రాన్ని పర్ఫెక్ట్గా ఆచరించింది యూట్యూబర్ సుధీర్.
రెండో వారంలో జరిగిన నామినేషన్లలో యూట్యూబర్ సుధీర్ సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. తొలి వారంలో పెద్దగా ప్రభావం చూపని సుధీర్, నామినేషన్లలో రోహిత్‌కు మద్దతుగా నిలిచి మాట్లాడగానే ఒక్కసారిగా స్క్రీన్ స్పేస్, కావాల్సినంత మైలేజ్ దక్కించుకున్నాడు. అది కూడా త్రిగుణ్ మీద ఎటాక్ చేస్తూ, అతని ఫేక్ గేమ్ ని, ఇతరులని ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్న విధానాన్ని బయటకు చెప్పడంతో జనాల్లో అతని మీద ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. సుధీర్ ని చూసి మిగిలిన వాళ్ళు కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సీరియల్ నటుడు ముఖేష్ నిన్నటి దాకా రోహిత్కి వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ రెండో వారంలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో త్రిగుణ్ ముఖేష్‌కి వ్యతిరేకంగా వేసిన వ్యూహాన్ని రోహిత్ నిజాయతీగా బయట పెట్టాడు. దాంతో ముఖేష్ వెంటనే రోహిత్ ని మెచ్చుకుంటూ పాజిటివ్గా కనిపించాడు. అయితే ఇది ఎక్కువ సేపు నిలవలేదు. రోహిత్‌ను 'ఫ్లిప్పర్' అంటూ వేరే వాళ్ళ దగ్గర మాట మార్చాడు ముకేశ్. ఇలాంటి రెండు నాల్కల ధోరణి అతన్ని టాప్ లీగ్‌లో నిలబెట్టడం కష్టమే.
ఇక అబ్బాయిల్లో ఏ దారి వైపు వెళ్లాలో తెలియక న్యూట్రల్గా సైలెంట్గా ఉన్న వాళ్ళల్లో ముఖ్యులు కృష్ణుడు, టెంపర్ వంశీ. ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళు ఎక్కువ కాలం ఈ గేమ్ లో నిలవడం కష్టమే.
ఇదిలా ఉండగా అమ్మాయిలు కూడా రోహిత్ త్రిగుణ్ ల మధ్య ఎవర్నో ఒకళ్ళని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి హౌజ్ లో ఉంది. త్రిగుణ్ అండ చూసుకుని ఝాన్సీ రోహిత్‌పై బహిరంగంగానే రెచ్చిపోతుంది. రోహిత్ గ్రూపులో ఉన్న మిగిలిన వాళ్ళు స్రిష్టి, షాలిని.
ఎవరి పక్షమూ వహించకుండా దేవయాని తన ఆటను మెరుగు పరుచుకుంటూ సేఫ్‌గా వెళ్తుంటే, వర్షిణి మాత్రం దారి తెన్నూ లేని గేమ్‌తో విఫలమవుతోంది. త్రిగుణ్ పక్షాన నిలిచిన వర్షిణి కూడా త్రిగుణ్ డౌన్ అవ్వడంతో ఎటూ తేల్చుకోలేని స్థితి లో పడిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈ గేమ్ లో న్యూట్రల్ ఉండటం కంటే రోహిత్ లేదా త్రిగుణ్ పక్షాన నిలవడమే కరెక్ట్ అనిపిస్తుంది.