త‌ప్పుకోవాల‌నుకున్నా? త‌ప్పించుకులోని స్థితిలో హీరోలు!

ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో లేదా ఒకే పండుగ సీజన్‌లో థియేటర్లలోకి రావడం కొత్తేం కాదు.

Update: 2026-09-14 15:30 GMT

ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో లేదా ఒకే పండుగ సీజన్‌లో థియేటర్లలోకి రావడం కొత్తేం కాదు. అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దెబ్బతినకూడదని.. అభిమానుల మధ్య అనవసరమైన వివాదాలు తలెత్తకూడదని భావించి కొందరు హీరోలు సైడ్ ఇచ్చి తమ సినిమాలను వాయిదా వేసుకోవడానికి సుముఖత చూపుతుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో ఆరోగ్యకరమైన పోటీ కోసం వెనక్కి తగ్గడం సహజంగానే జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఎంత వెనక్కి తగ్గాలని అనుకున్నా? ప‌రిస్థితులు వారి చేతుల్లో ఉండ‌వు.

దానికి ప్రధాన కారణం డిజిటల్ విప్లవం తర్వాత చిత్ర పరిశ్రమలో పెరిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం. సినిమా నిర్మాణం ప్రారంభ దశలోనే ఓటీటీ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలు, వారిచ్చే స్ట్రీమింగ్ స్లాట్లు కారణంగా నిర్మాతలు విడుదల తేదీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేని చిక్కుముడిలో పడిపోతున్నారు.

ఓటీటీ సంస్థలు భారీ డిజిటల్ హక్కుల ధరను చెల్లించినప్పుడు నిర్దిష్టమైన షరతులు విధిస్తాయి. థియేట్రికల్ విడుదలైన సరిగ్గా నాలుగు లేదా ఎనిమిది వారాల వ్యవధిలోనే ఆ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయాలనే కఠిన నిబంధన ఉంటుంది.

ఒకవేళ పోటీగా మరో పెద్ద సినిమా బరిలోకి దిగినా? ముందుగా నిర్ణయించిన థియేటర్ విడుదల తేదీ నుంచి వెనక్కి తగ్గడం నిర్మాతలకు ఆర్థికంగా ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ హీరో లేదా నిర్మాత వేరొక హీరో సినిమాతో పోటీ వద్దని రిలీజ్ డేట్‌ను కొన్ని వారాలు ముందూ వెనుకా వాయిదా వేస్తే ఒప్పందం ప్రకారం ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ ఉల్లంఘనకు గురవుతుంది. ఇది డిజిటల్ డీల్ రద్దు కావడానికి లేదా భారీగా జరిమానాలు పడటానికి దారితీస్తుంది. అంతటి ఆర్థిక నష్టాన్ని భరించడం కంటే? ఎంత పెద్ద పోటీ ఉన్నప్పటికీ అదే తేదీకి థియేటర్లలోకి రాక తప్పని పరిస్థితి హీరోలకు ఏర్పడుతోంది.

ఈ పరిణామాల వల్ల హీరోల ప్రమేయం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే బాక్సాఫీస్ వద్ద క్లాష్ అనివార్యమవుతోంది. థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ డీల్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నిర్మాతలకే కాకుండా హీరోలకు కూడా తలనొప్పిగా మారింది. స్నేహపూర్వకంగా సర్దుబాటు చేసుకోవాలనుకున్నా? నాన్-థియేట్రికల్ ఒప్పందాలు చేతులను కట్టేస్తుండటంతో నిశ్శబ్దంగా పోటీకి దిగాల్సి వస్తోంది.

మొత్తానికి సినిమా విడుదల విషయంలో హీరోలు .. నిర్మాతల కంటే కూడా ఓటీటీ సంస్థల షెడ్యూల్స్, బిజినెస్ మోడల్సే తుది నిర్ణయాన్ని శాసిస్తున్నాయి. వెనక్కి తగ్గుదామనుకున్నా తప్పించుకోలేని డిజిటల్ యుగంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా ఓటీటీ స్లాట్ నియమాలకు అనుగుణంగానే ఉండాల్సి వ‌స్తోందన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News