కంగ‌న‌-హృతిక్ మ‌ధ్య వివాదం ఇసుక‌లో క‌ప్పిన నిప్పు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ..ఎంపీ కంగనా రనౌత్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

Update: 2026-08-02 08:09 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ..ఎంపీ కంగనా రనౌత్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. గతంలో నటుడు హృతిక్ రోషన్‌తో తలెత్తిన విభేదాలు .. ఆ వివాదానికి సంబంధించిన ఆన్‌లైన్ ట్రెండ్స్‌పై కంగ‌న స్పందించిన తీరు మ‌రోసారి బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాత విషయాలను మళ్లీ తవ్వి తీయడంపై కంగ‌న‌ తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియాలో ఇటీవల సారీ హృతిక్ రోష‌న్ పేరుతో ఒక ట్రెండ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌పై హృతిక్ రోషన్ పరోక్షంగా స్పందించిన తీరును ఉద్దేశించి కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి అనవసరమైన విషయాలపై స్పందించి మంటకు ఆజ్యం పోయవద్దని ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ కంగనా బ‌ధులివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్రస్తుతం ఆయన మరొకరితో కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అయినప్పటికీ పాత వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి ఒక మహిళను ఏడిపించడం ..ఇబ్బంది పెట్టడం ఆయన స్థాయికి తగదని కంగ‌న విమర్శించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి విషయాలను ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు.

కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇద్ద‌రి మధ్య నడిచిన న్యాయపోరాటాలు, పరస్పర ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కంగనా చేసిన కామెంట్లతో ఇండస్ట్రీలో మరోసారి పాత వివాదాలను చర్చలోకి వ‌స్తున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, గతంలో జరిగిన పరాభవాలు ..వివాదాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ సజీవంగానే ఉంటున్నాయి. నెటిజన్లు చేసే ట్రెండ్స్ కొన్నిసార్లు సంబంధిత సెలబ్రిటీలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి.

అయితే ఇలాంటి ట్రోల్స్ .. ట్రెండ్స్‌ను సెలబ్రిటీలు ఏ విధంగా డీల్ చేయాలనే దానిపై చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా? కంగనా రనౌత్ ఎలాంటి మొహమాటం లేకుండా మనసులోని మాటలను బహిరంగంగా మాట్లాడటం ఆమె నైజం. తాజాగా హృతిక్ రోషన్ వ్యవహారంపై ఆమె స్పందించిన తీరు చూస్తుంటే వివాదం ఇసుకలో కప్పిన నిప్పులా ఎప్పుడూ రగులుతూనే ఉంటుందని అర్ద‌మ‌వుతోంది.ఈ పరిణామాల నేప‌థ్యంలో హృతిక్-కంగ‌న అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యుద్దం జ‌రుగుతోంది.

ఒక‌ర్ని ఒక‌రు దూషించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. స్నేహితులుగా క‌ల‌వ‌డం ప్రేమికులు అవ్వ‌డం పొస‌గ‌క‌పోతే విడి పోవ‌డం బాలీవుడ్ చాలా సాధార‌ణ విష‌యం. ఆ త‌ర్వాత మ‌ళ్లీ న‌చ్చితే స్నేహితులుగా కొన‌సాగుతారు. లేదంటే? ఎవ‌రి మానాన వాళ్లు ఉంటారు. కానీ దూర‌మై సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా? ఇప్ప‌టికీ హృతిక్-కంగ‌న మ‌ధ్య లొల్లి మాత్రం కొలిమిలో నిప్పులా కాగుతూనే ఉండ‌టం దుర‌దృష్ట కరం.

Tags:    

Similar News