ఆ ఫేజ్ నుంచి బయటికొస్తున్న క్రేజీ హీరోయిన్!
ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ఔరంగబాద్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్ మూవీ `యారియా 2`తో చిన్న క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇచ్చింది.;
సినిమా ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ అలవాటు ఉంది. ఎవరైనా ఒక జోనర్ మూవీ, క్యారెక్టర్‌తో సక్సెస్ అయితే మిగతా వాళ్లు కూడా అదే తరహా కథలు, పాత్రలు ఆఫర్ చేస్తుంటారు. వారిని అదే జోనర్‌కి పరిమితం చేస్తుంటారు. దీంతో వారికి మిగతా జోనర్ స్టోరీస్, క్యారెక్టర్లలో నిరూపించుకునే అవకాశం ఉన్నా కానీ అలాంటి ఆఫర్లు లభించవు. చాలా వరకు అలాంటి సినిమాలు, పాత్రలకే పరిమితం చేస్తుంటారు. దీంతో ఎప్పుడే ఒకే తరహా జోనర్ సినిమాలు చేసిన వారికి ఆ జోనర్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? ..ఎప్పుడెప్పుడు కొత్త జోనర్‌లోకి వెళ్లి తమని తాము నిరూపించుకుందామా? అని పిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ఔరంగబాద్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్ మూవీ `యారియా 2`తో చిన్న క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇచ్చింది. `చందూ ఛాంపియన్`లోనూ జర్నలిస్ట్ నయనతారగా కనిపించిందే కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇది 1964 నేపథ్‌యంలో సాగే స్టోరీ. ఆ తరువాత కూడా ఇదే తరహాలో పీరియడిక్ స్టోరీస్ తనని వెతుక్కుంటూ వచ్చాయి. మిస్టర్ బచ్చన్` తను తెలుగులో పరిచయమైన మూవీ. ఇది కూడా పీరియడ్ స్టోరీనే. బాలీవుడ్ మూవీ `రైడ్` ఆధారంగా రీమేక్ అయిన ఈ మూవీ సక్సెస్ కాలేకపోయినా భాగ్యశ్రీకి మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఆ తరువాత విజయ్ దేవరకొండతో చేసిన `కింగ్‌డమ్`, దుల్కర్ సల్మాన్‌తో చేసిన `కాంత`, ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` వంటి సినిమాలు కూడా పిరియడ్ నేపథ్య సినిమాలే కావడం గమనార్హం. అయితే విచిత్రం ఏంటంటే ఇందులో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అనిపించుకోలేదు అయితే హీరోయిన్‌గా మాత్రం భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్‌లో మంచి పాపులారిటీని తెచ్చి పెట్టాయి. గ్లామర్ హీరోయిన్‌గా పరిశ్రమ వర్గాలని ఆకర్షించింది. అయితే వరుసగా పీరియడ్ సినిమాలు రావడంతో భాగ్యశ్రీకి బోర్ కొట్టిందట.
దీంతో ఇప్పుడు తనకు వాటి నుంచి ఛేంజ్ కావాలని చూస్తోంది. పిరియడ్ మూవీస్ చేసి చేసి బోర్ కొట్టిందని, సరికొత్త నేపథ్యంలో సాగే నేటి జనరేషన్ మూవీస్ కావాలని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న `లెనిన్` మూవీ చేస్తోంది. ముందు ఇందులో శ్రీలీలని తీసుకుని ఓ షెడ్యూల్ చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తనని తప్పించి ఆ స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని తీసుకుని సినిమా పూర్తి చేశారు. `వినరో భాగ్యము విష్ణుకథ` ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
విలేజ్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు.మే 1న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనిపైనే భాగ్యశ్రీ బోర్సేతో పాటు హీరో అఖిల్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది హిట్ అయితే ఈ ఇద్దరి కెరీర్ మరో మలుపు తిరుగుతుంది. దాని కోసమే ఈ ఇద్దరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తరువాత మోడ్రన్ క్యారెక్టర్‌తో సాగే సినిమా కోసం భాగ్యశ్రీ ఎదురు చూస్తోంది.