ముట్టుకోవద్దు..తాకొద్దు లాంటి కండీష‌న్లు పెట్ట‌ని న‌టి!

సినిమాలో భాగంగా వచ్చే రొమాంటిక్ .. ఘాటైన సన్నివేశాల్లో నటించేటప్పుడు రేఖ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని శేఖర్ సుమన్ గుర్తు చేసుకున్నారు.

Update: 2026-07-21 19:30 GMT

బాలీవుడ్ సీనియర్ నటుడు శేఖర్ సుమన్ తొలి చిత్రం `ఉత్సవ్` షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ నటి రేఖ వృత్తిపరమైన నిబద్ధతను కొనియాడారు. 1984లో వచ్చిన ఈ క్లాసిక్ చిత్రంలో శేఖర్ సుమన్ సరసన రేఖ నటించారు. అప్ప‌టికే రేఖ పరిశ్రమలో అగ్రతారగా వెలిగిపోతున్నారు. ఆమె నో చెబితే? మ‌రో మాట లేకుండా ద‌ర్శ‌కులు పాటించే రోజుల‌వి. అలాగ‌ని రేఖ ఏనాడు హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌లేదు. తానెంత పెద్ద‌ న‌టి అయినా? న‌ట‌న‌లో నిత్య విద్యార్దిగానే కొన‌సాగారు. తాజాగా ఇదే విష‌యాన్ని శేఖ‌ర్ సుమ‌న్ గుర్తు చేసుకున్నారు.

'ఉత్స‌వ్' సెట్లో రేఖ ప్రవర్తనలో ఏనాడు ఎలాంటి గర్వం కనిపించలేదన్నారు. కొంతమంది నటీనటులు సెట్‌కు భారీ తారాగణంతో, ప్రత్యేక సిబ్బందితో వచ్చి తమ స్టార్‌డమ్‌ను ప్రదర్శిస్తుం టారని శేఖర్ సుమన్ అభిప్రా యపడ్డారు. అలాంటి హంగు ఆర్భాటాలు, హావభావాలు ప్రదర్శించే నటుల వల్ల తోటివారికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. కానీ రేఖ మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటూ పక్కనే కూర్చొని కొత్త నటుడైన తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేదని దీంతో తనకు ఎలాంటి భయం లేకుండా స‌ర‌దాగా మెలిగే వాడిన‌న్నారు.

సినిమాలో భాగంగా వచ్చే రొమాంటిక్ .. ఘాటైన సన్నివేశాల్లో నటించేటప్పుడు రేఖ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని శేఖర్ సుమన్ గుర్తు చేసుకున్నారు. `ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ తాకవద్దు` అని రేఖ ఎప్పుడూ షరతులు పెట్టలేదని.. రీ-టేక్‌లు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంత‌రం చెప్పేవారు కాద‌న్నారు. పెద్ద స్టార్‌ అయినా? ఆమె ఎంతో సాధారణంగా సహకరిస్తూ పని చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు.

దర్శకుడు గిరీష్ కర్నాడ్ ఇచ్చిన సలహా వల్లనే రేఖతో నటించేటప్పుడు ఎలాంటి సంకోచం కలగలేదని శేఖర్ తెలిపారు. ఆమెను రేఖ అనే మహానటిగా కాకుండా ఆ చిత్రంలోని వసంతసేన అనే ఒక పాత్రగా మాత్రమే చూడాలని గిరీష్ కర్నాడ్ సూచించారన్నారు. ఈ చిన్న మెంటల్ ట్రిక్ తనకు కెమెరా ముందు ఎంతో సహాయపడిందని, సహజంగా నటించడానికి దోహదపడిందని వివరించారు. అప్పట్లో శశి కపూర్ లాంటి దిగ్గజ నిర్మాత తనలాంటి కొత్త కుర్రాడిని నమ్మి అవకాశం ఇవ్వడం తన జీవితంలో మరువలేని మలుపు అని తెలిపారు.

పరిశ్రమలో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అడుగుపెట్టిన తనను ఆదరించి మంచి పాత్రను అందించిన చిత్ర బృందానికి తానెప్ప‌టికీ రుణపడి ఉంటాన‌న్నారు. మొత్తానికి నాటి తరం అగ్రనటీమణుల వృత్తి ధర్మం, తోటి నటులను గౌరవించే తీరు నేటి తరానికి ఆదర్శనీయమని చెప్పొచ్చు. స్టార్‌డమ్ అనేది తెరపైనే కాకుండా తోటివారితో ప్రవర్తించే విధానంలో ఉంటుందని రేఖ నిరూపించారు.

Tags:    

Similar News