అందరి కళ్లు నటవారసురాలిపైనే.. ఎందుకింత పిచ్చి క్రేజ్?

ప్రస్తుతం నేపో కిడ్స్ (వారసులు)లో ఆలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలో తమ నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుని నిరూపించుకున్నారు.

Update: 2026-07-22 02:58 GMT

బాలీవుడ్‌ను దశాబ్దాలుగా ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలుతున్న బాద్‌షా షారుఖ్ ఖాన్ నటవారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన సుహానా ఖాన్ పై ప్రస్తుతం అసాధారణమైన ఒత్తిడి, అంచనాలు ఉన్నాయి. గతంలో ఓటీటీలో వచ్చిన `ది ఆర్చీస్` సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. అందులో యువ‌న‌టి నటనపై కొన్ని విమర్శలొచ్చాయి. ఆ విమర్శలన్నింటికీ సమాధానం చెబుతూ... తాను తండ్రికి తగ్గ సిసలైన నటవారసురాలినని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సుహానాపై పడింది.

ప్రస్తుతం నేపో కిడ్స్ (వారసులు)లో ఆలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలో తమ నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుని నిరూపించుకున్నారు. ఆ తర్వాత తరం నటవారసురాళ్లుగా వస్తున్న సుహానా ఖాన్, ఖుషీ కపూర్, శనాయా కపూర్ వంటి వారు తమ సత్తా చాటాల్సి ఉంది. అయితే వీరందరిలోకి షారుఖ్ కుమార్తె కావడంతో సుహానా ఖాన్ చేసే ప్రతి అడుగుపైనే సినీ వర్గాలు స‌హా ప్రేక్షకుల దృష్టి ప్రత్యేకంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా తన తండ్రి షారుఖ్ ఖాన్‌తో కలిసి పూర్తిస్థాయి థియేట్రికల్ సినిమాలో ఖాన్ డాట‌ర్ నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కి కొండంత క్రేజ్‌ను తీసుకొచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `కింగ్` తో సుహానా డెబ్యూ ఇస్తోంది. తండ్రీకూతుళ్లు తొలిసారిగా తెరపై ఒకేసారి కనిపించబోతుండటం అభిమానులకు కన్నుల పండుగ కానుంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తన మొదటి థియేట్రికల్ డెబ్యూ `కింగ్` సినిమాతోనే సుహానా తన నటనా పటిమతో విమర్శకుల ప్రశంసలు అందుకుని... తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News