ప్రతి కంట్రీకి వెళ్లినా పోలీస్టేషన్ తప్పనిసరి!
మూవీ షూటింగ్ అంటే ఓ పండగ, చాలా మంది క్రియేటివ్ పీపుల్స్ ఒకే సినిమాకు కలిసి పని చేస్తుంటారు.;
మూవీ షూటింగ్ అంటే ఓ పండగ, చాలా మంది క్రియేటివ్ పీపుల్స్ ఒకే సినిమాకు కలిసి పని చేస్తుంటారు. అది కేవలం సినిమా రంగానికే సాధ్యం. అలా క్రియేటివ్ పీపుల్స్ అంతా కలిసి ఒక చోట చేరడానికి కొంత మంది ప్రొఫెషనల్ వర్క్‌గా భావించి ఎవరి పని వారు చేసుకుంటూ వెళితే.. జగ్గూభాయ్ మాత్రం ఆ క్షణాలని ఓ సెలబ్రేషన్‌ల జరుపుతూ ఎంజాయ్ చేస్తుంటారట. గత కొంత కాలంగా ఇదే పంథాని అనుసరిస్తూ వస్తున్నారట. అంతే కాకుండా ఆయనని మూవీ టీమ్ అంత ఓ పేరుతో పిలవడం అలవాటుగా మారిందట.
అదేంటన్నది..సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లే టీమ్ కోసం ఆయన చేసే సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది? ఇందు కోసం జగ్గూభాయ్ జగపతిబాబు ఏం చేస్తారు. టీమ్ సభ్యులకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ని ఇస్తారు? అనే విషయాలని జగపతిబాబు రీసెంట్‌గా ఓ పోడ్ కాస్ట్‌లో వెల్లడించా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇండస్ట్రీలో నాలుగు దశబ్దాలుగా కొనసాగుతూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫాదర్‌గా ఇలా విభిన్నమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్న జగపతిబాబు చెప్పిన ఆసక్తికర విశేషాలు ఆయన మాటల్లోనే..
నా కెరీర్‌లో ఏం జరిగిందో చాలా వరకు నాకు గుర్తు లేదు. సగం కంట్రీస్ కూడా గుర్తు లేదు. ఏదైనా షూటింగ్ కోసం విదేశాలకు వెళుతున్నామంటే ఏయిర్ పోర్ట్‌లో టకీలా షాట్స్‌తో మొదలవుతుంది. యూనిట్ మెంబర్స్ అందరికి అప్పటికే రెండు రౌండ్‌లు పంపించేస్తాను. తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యే వరకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో ఎక్కడా ఆగదు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ట్రావెలింగ్‌లో యూనిట్ అంతా మంచి జోష్‌లో ఉంటాం. కంట్రీ క్రాస్ అవుతున్నామంటే అదొక మజా.
సో ఆ మజాని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనేది నా టార్గెట్. దాదాపు ప్రతీ కంట్రీకి షూటింగ్ కు వెళ్లినప్పుడల్లా కంపల్సరీగా ఓ పోలీస్టేషన్‌కు వెళ్లాల్సిందే. అంత వరకు ఖచ్చితంగా తీసుకెళ్తా. ఫైట్‌లు, వైలెన్స్ కాదు. కావాలనే అల్లరి చేస్తాం. ఏమీ లేకపోయినా వాళ్ల దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుని సరదాగా నవ్వుకుని స్టేషన్ నుంచి బయటికి రావడం అదో సరదా. వేగస్‌లో ఓ సంఘటన జరిగింది. అక్కడికి చార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లాం. ఇక్కడి నుంచి న్యూయార్క్ వరకు వెళ్లాం. అక్కడికి వెళ్లాక సడన్‌గా ఆర్లాండో వెళ్లాలని ఫిక్సయి అక్కడికి వెళ్లాం. నేను, మరో వ్యక్తి ఇద్దరం కలిసి వెళ్లాం. ఆ రెండో పర్సన్ ఎవరన్నది చెప్పను.
వేగాస్‌లో గ్యామ్లింగ్ చేస్తున్నాం. బ్లాక్ జాక్ కొట్టిన ప్రతిసారి చిత్రంగా చూడటం మొదలు పెట్టాను. బ్లాక్ జాక్ కొట్టగానే `అప్‌డి పోడే పోడే` అంటే స్టెప్స్ వేశాను. అది చూసిన వాళ్లు సర్ మీరు ఇలా డ్యాన్స్ చేయకూడదు. ఇది కసీనో ప్లోర్. మీరు అలా చేయడం వల్ల అందరి కాన్సట్రేషన్ దెబ్బతింటుంది అన్నారు. అయినా సరే నేను మళ్లీ మళ్లీ అదే చేసేవాడిని. ఆ తరువాత రూమ్‌కి వెళ్లి మళ్లీ బీభత్సం చేసేవాడిని. అది తట్టుకోలేక రూమ్‌కి వచ్చి కొంత మంది వార్నింగ్ ఇచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. వాళ్ల వల్ల కాక రూమ్‌లోకి స్మోక్ పంపంచారు. వెంటనే ఫైర్ అలారం కొట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాం` ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నన్ను అంతా `టకీలా కింగ్` అని పిలుస్తుంటారు` అంటూ జగ్గూభాయ్ తన ఫారిన్ ట్రిక్ సంగతుల్ని చెప్పుకొచ్చారు.