తమన్నా గురించి ఇంటి పక్కన వారి కామెంట్స్‌..!

రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉండే మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఒక చిట్‌ చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.;

Update: 2025-05-23 04:06 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆఫర్లు కాస్త తగ్గినా ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోయింగ్‌ చూస్తే మతి పోతుంది. పదుల కొద్ది ఫ్యాన్‌ పేజీలు ఉంటాయి, ఆమె అఫిషియల్‌ సోషల్‌ మీడియా పేజీలకు విపరీతమైన ఆధరణ ఉంటుంది. మిల్కీ బ్యూటీ మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కాకున్నా ఏదో ఒక రకంగా సినిమాల్లో కనిపిస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. తమన్నా ఐటెం సాంగ్‌ చేసింది అంటే ఆ సినిమాకు మంచి హైప్‌ వస్తుంది, అంతే కాకుండా తమన్నా వెబ్‌ సిరీస్‌ చేస్తే ఆ వెబ్‌ సిరీస్‌కి మంచి బజ్‌ క్రియేట్‌ అవుతుంది.

తమన్నా ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతుంది. సాధారణంగా సౌత్‌ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన వారికి హిందీ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు రావు అనే టాక్‌ ఉంది. కానీ తమన్నాకు అక్కడ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కంటే ఇతర భాషల్లో ఎక్కువగా నటిస్తూ ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలు ఈమె వయసు పెరుగుతుందా..? తగ్గుతుందా? అనే అనుమానం కలుగుతుంది. మూడు పదుల వయసులోనూ ఈమె పాతికేళ్ల పడుచు అందగత్తెగా కనిపిస్తుంది అంటూ అభిమానులు తెగ కామెంట్‌ చేస్తూ ఉంటారు.

రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉండే మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఒక చిట్‌ చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడి దొడుకుల గురించి చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం నా తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను సినిమాల్లో నటిస్తాను అంటూ తెలిసిన వెంటనే పక్కింటి వారు కామెంట్‌ చేయడం మొదలు పెట్టారు. మా ఇంటి చుట్టు పక్కల వారు అమ్మా నాన్నతో అవమానకరంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉండే దారుణ పరిస్థితి గురించి కుప్పలు తెప్పలుగా అమ్మానాన్న కి వారు చెప్పి భయపెట్టారు. వారి మాటలు విని నన్ను ఇండస్ట్రీలో అమ్మానాన్న అడుగు పెట్టనివ్వకుంటే నేను హీరోయిన్‌గా కనీసం పరిచయం అయ్యేదాన్ని కాదు అంది.

సినిమా ఇండస్ట్రీ అనగానే కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ, విమర్శలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో కొందరు అంకుల్స్ హీరోయిన్స్‌ ఎలా ఉండాలి, వారు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి అంటూ చెబుతూ పోస్ట్‌లు పెట్టడం చూస్తూ ఉంటాం. బాధ్యతగల మీడియా అలాంటి వారిని ఎంకరేజ్‌ చేయకుండా, వారికి తగిన సమాధానం చెప్పి అమ్మాయిల సమన్యాయం ను కాపాడాల్సిన అవసరం ఉందని తమన్నా అభిప్రాయం వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికీ ఒకింత భయం ఉంటుంది. అమ్మాయిలను ఇండస్ట్రీలోకి పంపించడం అవసరమా అని చాలా మంది భావిస్తూ ఉంటారు.

Tags:    

Similar News