భిన్నమైన ఫోజులతో ఆశ్చర్యపరిచిన అమైరా దస్తూర్!

మోడల్ గా కెరియర్ ను ఆరంభించి.. 2013లో వచ్చిన 'ఇసాక్' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది ప్రముఖ గ్లామర్ బ్యూటీ అమైరా దస్తూర్.;

Update: 2026-02-05 14:30 GMT

మోడల్ గా కెరియర్ ను ఆరంభించి.. 2013లో వచ్చిన 'ఇసాక్' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది ప్రముఖ గ్లామర్ బ్యూటీ అమైరా దస్తూర్. తొలి పరిచయం లోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తొలి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్స్ కి నామినేట్ కూడా చేయబడింది. ఆ తర్వాత 2015లో అనేగన్ అనే తమిళ చిత్రంతో తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే తెలుగులో మాత్రం 'మనసుకు నచ్చింది' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ హిందీ ముద్దుగుమ్మ.




సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా 2018 ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత రాజుగాడు సినిమాలో నటించి మళ్లీ తెలుగులో నటించలేదు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె 2022లో భగీర అనే తమిళ చిత్రంలో నటించింది.

అమైరా దస్తూర్ ఈమధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. రోజుకొక ఫోటో షూట్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే నిత్యం గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే ఈమె తాజాగా యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ ధరించిన ఈమె వెల్లకిలా పడుకొని.. రెండు చేతుల సహాయంతో శరీరాన్ని పైకి లేపి.. ఒక కాలు కిందకు పెట్టి మరొక కాలును నిటారుగా పైకి పెట్టి యాక్షన్ ఫోజులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవడంతో.. ఇది చూసిన అభిమానులు ఈమె ఫిట్నెస్ కి ఫిదా అవుతున్నారు.

ఈ రేంజ్ లో భంగిమలకు ఫోజులు ఇవ్వడం అంటే సాధ్యమైన పని కాదు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అమైరా దస్తూర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ రెండు ఫోటోలు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈమె ఫిట్నెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు . ఇకపోతే ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల విషయానికొస్తే.. షిద్దత్ 2 సినిమాలో నటిస్తోంది. అలాగే జీవాతో కలిసి తమిళ్లో ఒక సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.

అలాగే మరో కొత్త ప్రాజెక్టులో కూడా భాగమైన ఈమె.. నెట్ ఫ్లిక్స్ సిరీస్ చుంబక్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు సినిమాలు, సీరీస్ లు అంటూ బిజీగా గడిపేస్తూ మరొకవైపు మరిన్ని పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు అందుకోవడానికి.. దర్శకుల నిర్మాతల కంట్లో పడడానికి ఇలా ఫోటోషూట్ తో కూడా రచ్చ చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె అందానికి నటనకి ఫాన్స్ ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.

Tags:    

Similar News