బంగారం లాంటి సీజ‌న్ డ‌బ్బింగ్ మ‌యం!

ఎంత గొప్ప సినిమా తీసాం అన్న‌ది కాదు ఆ సినిమా అనుకూల‌మైన‌, స‌రైన స‌మ‌యంలో రిలీజ్ అయిందా? లేదా? అన్న‌ది కూడా అంతే కీల‌కం.;

Update: 2026-02-05 13:30 GMT

ఎంత గొప్ప సినిమా తీసాం అన్న‌ది కాదు ఆ సినిమా అనుకూల‌మైన‌, స‌రైన స‌మ‌యంలో రిలీజ్ అయిందా? లేదా? అన్న‌ది కూడా అంతే కీల‌కం. మంచి సినిమా తీసినా రిలీజ్ సీజ‌న్ స‌రైంది కాక‌పోయిన సంద‌ర్భాల్లో ఫెయిలైన సినిమాలెన్నో ఉన్నాయి. మంచి సినిమా ఫెయిలైంద‌నే టాక్ వ‌చ్చిందంటే? అక్క‌డ రిలీజ్ ఆటంకాలు ఏర్ప‌డిన‌ట్లుగానూ భావించాల్సి ఉంటుంది. ఏడాదిలో మార్చి నెల‌ను సినిమాల‌కు మంచి రిలీజ్ లుగా నిర్మాత‌లు భావిస్తుంటారు. స్కూల్, కాలేజీల‌కు సెల‌వులు ఆరంభమ‌య్యే సీజ‌న్. ఎండ‌ల మొద‌ల‌య్యే స‌మ‌యం అదే.

ఏప్రిల్, మేనెల‌లో తీవ్ర‌మైన ఎండ‌ల నేప‌థ్యంలో మార్చిలోనే రిలీజ్ అయితే? ఓపెనింగ్స్ బాగుంటాయ‌ని న‌మ్ముతంటారు. అందుకే వీలైనంత వ‌ర‌కూ మార్చి రిలీజ్ తేదీల్ని ఎవ‌రూ మిస్ చేసుకోరు. అలాంటి బంగారం లాంటి సీజ‌న్ ను కొన్ని టాలీవుడ్ సినిమాలు మిస్ చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌తిగా ఆ సీజ‌న్ డ‌బ్బింగ్ సినిమాల మయంగా మారుతోంది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే మార్చి 19 నుంచి అస‌లైన జాత‌ర మొద‌ల‌వుతుంది.

బాలీవుడ్ చిత్రం `ధురంధ‌ర్ 2` అదే తేదికి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. దీంతో పాటు య‌శ్ న‌టిస్తోన్న పాన్ ఇండియా సినిమా `టాక్సిక్` కూడా ఇదే రోజుల‌న రిలీజ్ ఫిక్స్ చేసారు. అయితే తాజాగా `టాక్సిక్` రిలీజ్ తేదీ మార‌డానికి అవ‌కాశాలున్నాయ‌ని వినిపిస్తోంది. అనివార్య కార‌ణాల‌తో డిలే జరుగుతోంది? అన్నది ప్రాధ‌మిక స‌మాచారం. తెలుగు నుంచి అడ‌వి శేష్ న‌టిస్తోన్న `డెకాయిట్` కూడా ఇదే తేదీకి రావాల్సి ఉంది. కానీ ఈసినిమా రిలీజ్ వాయిదా ప‌డింది. ఏప్రిల్ 10న రిలీజ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏ కార‌ణంగా డిలే అవుతుందంటే? రెండు పాన్ ఇండియా చిత్రాల పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌న్న‌ది ఓ వెర్ష‌న్ అయితే? పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జాప్యం అన్న‌ది మ‌రో కార‌ణంగా తెర‌పైకి వ‌స్తోంది. వారం వ్య‌వ‌ధిలోనే రిలీజ్ అవ్వాల్సిన మ‌రో రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా వాయిదా ప‌డ్డాయి. అవే `పెద్ది`, `ప్యార‌డైజ్`. తొలుత `పెద్ది` చిత్రాన్ని మార్చి 26న పాన్ ఇండియాలో రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. దీంతో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న ` ది ప్యార‌డైజ్` రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. కానీ `పెద్ది` చిత్రం ఏప్రిల్ 30కి వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్యార‌డైజ్ ని కిందా మీదా ప‌డి దించుతారా అనుకున్నా? ఆ సినిమా కూడా వాయిదా ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

మొహ‌రం సంద‌ర్భంగా జూన్ 27న ప్యార‌డైజ్ ని రిలీజ్ చేసే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలిసింది. మొత్తంగా `ధురంధ‌ర్ 2`కి మాత్రం టాలీవుడ్ క్లియ‌రెన్స్ ఇచ్చేసింది. `ధురంధ‌ర్` విజ‌యం చూసి రెండ‌వ భాగాన్ని పాన్ ఇండియాలో అన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడా సినిమాకు తెలుగు మార్కెట్ కూడా కీల‌క‌మే. `టాక్సిక్` కూడా పోటీ బ‌రిలో లేక‌పోతే `ధురంధ‌ర్ 2` హిట్ టాక్ తెచ్చుకుంటే? తెలుగు రాష్ట్రాల నుంచే భారీ వసూళ్లు సాధించే అవ‌కాశం ఉంది. వారం గ్యాప్ లో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ `రిలీజ్ అయినా? అప్ప‌టికీ `ధురంధ‌ర్ 2` చుట్ట బెట్టా ల్సిందంతా చుట్ట‌బెట్టేస్తుంది. `భ‌గ‌త్ సింగ్` కి హిట్ టాక్ వ‌స్తే? త‌ప్ప‌ `ధురంధ‌ర్` వేగాన్ని ఆప‌డం అంత సుల‌భం కాదు.

Tags:    

Similar News