'ది ప్యారడైజ్' ప్రీరిలీజ్: రికార్డుల‌పై నేచుర‌ల్ స్టార్ మాస్ ఫ్యాన్స్ ర‌చ్చ‌

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`పై ప్రస్తుతం ఇండస్ట్రీలో - సోషల్ మీడియాలో భారీ చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-09-21 16:27 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`పై ప్రస్తుతం ఇండస్ట్రీలో - సోషల్ మీడియాలో భారీ చ‌ర్చ సాగుతోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ - మెట్రో న‌గ‌రాల్లో ప్రమోషన్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల జోష్, సినిమా బిజినెస్ .. ఇతర విశేషాలతో కూడిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ తారస్థాయికి చేరింది. నాని మాస్ యాక్షన్ లుక్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. నాని ఈసారితో ఏకంగా 100 కోట్ల క్లబ్ ను దాటి 1000 కోట్ల స్థాయికి వెళతాడంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఈవెంట్‌లో యాంకర్ సుమ హోస్టింగ్ తీరు..త‌న‌ స్టేజ్ ప్రెజెన్స్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హీరోల మార్కెట్, `టైర్-1 వర్సెస్ టైర్-2` కేటగిరీల గురించి నెటిజన్ల మధ్య జరుగుతున్న చర్చలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

`ది ప్యారడైజ్` సినిమా బిజినెస్ పరంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అంచనాలను తలక్రిందులు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రీ-రిలీజ్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ. 100 కోట్ల మార్క్‌ను దాటాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో టైర్-2 హీరోల మార్కెట్‌లో ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇక ప్రాంతాల వారీగా చూస్తే... నైజాం హక్కులు రూ. 34 కోట్లు, సీడెడ్ రూ. 10 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 8.5 కోట్లతో పాటు మిగతా ఏపీ ప్రాంతాలు .. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఓవర్సీస్ (విదేశీ) హక్కులు దాదాపు రూ. 16.5 కోట్లకు పైగా పలికాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌తో పాటు ఓవర్సీస్ కలుపుకుని సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్-ఈవెన్ సాధించాలంటే సుమారు రూ. 102 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

థియేట్రికల్ హక్కులతో పాటు ఈ చిత్రానికి సంబంధించి నాన్-థియేట్రికల్ వ్యాపారం కూడా భారీ స్థాయిలోనే జరిగిందని సమాచారం. డిజిటల్ (OTT) స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ హక్కులు , హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాతలు పెట్టుబడిలో పెద్ద ఎత్తున రికవరీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల - నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఉన్న హైప్ దృష్ట్యా.. ఓపెనింగ్ రోజునే బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

Tags:    

Similar News