తెలుగు ఇండస్ట్రీలో మరో 'అవతార్' చూడబోతున్నాం: రామ్-లక్ష్మణ్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో నేటి సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.

Update: 2026-09-21 16:28 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో నేటి సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాపై వారు ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను రామ్-లక్ష్మణ్ ఈ సందర్భంగా కొనియాడారు. `రంగస్థలం` చిత్రానికి పని చేసిన సమయంలో ఎక్కడో వెనుక ఉన్న శ్రీకాంత్, `దసరా` సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడని ప్రశంసించారు. ``ఎప్పుడు వచ్చావని కాదు.. బుల్లెట్ దిగిందా లేదా`` అన్నట్లుగా లేటుగా వచ్చినా బాక్సాఫీస్ వద్ద శ్రీకాంత్ తన సత్తా చాటారని.. తెలుగు ఇండస్ట్రీలో అతి త్వరలోనే అగ్ర దర్శకుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటారని వారు అభిప్రాయపడ్డారు.

హాలీవుడ్‌లో `అవతార్` సినిమా గురించి ఏవిధంగా చెప్పుకుంటామో.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో `ది ప్యారడైజ్` రూపంలో అలాంటి మరో అద్భుతమైన విజువల్ వండర్... సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని రామ్-లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా తెరకెక్కిందని..ప్రేక్షకురలందరూ ఈ సరికొత్త అనుభూతిని థియేటర్లలో ఆస్వాధించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

నాని నటన ..ఆయన పడిన కష్టాన్ని రామ్-లక్ష్మణ్ ప్రత్యేకంగా అభినందించారు. సాధారణంగా ఫ్యామిలీ, లవ్ కథలతో మెప్పించే నాని.. ఈ మాస్ యాక్షన్ పాత్ర కోసం పడిన శ్రమ మామూలుది కాదని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు షూటింగ్ చేస్తూ.. కఠినమైన డైటింగ్ - వర్కవుట్లు చేస్తూ నాని చూపిన ఓపిక, అంకితభావం అద్భుతమన్నారు. ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన నాని మునుముందు రోజుల్లో గొప్ప లీడర్ అవుతారని ప్రశంసించారు.

నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయికి అంద‌రూ ప్రాణం పెట్టారని.. సినిమాటోగ్రాఫర్ సాయి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌లతో పాటు టెక్నీషియన్లందరి టీమ్‌వర్క్ అద్భుతంగా కుదిరిందని తెలిపారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తెలుగు సినిమా ని మరో స్థాయికి తీసుకెళ్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News