తుమ్మక్ తుమ్మక్.. 'కావాలా' సాంగ్‌ని మించిన కిక్కు?!
ఆజ్‌కీ రాత్....,నషా..., కావాలా..., స్వింగ్ జరా... ఇలా ఐటమ్ పాట ఏదైనా తమన్నా స్టెప్పేస్తే ఆ కిక్కే వేరు.
ఆజ్‌కీ రాత్....,నషా..., కావాలా..., స్వింగ్ జరా... ఇలా ఐటమ్ పాట ఏదైనా తమన్నా స్టెప్పేస్తే ఆ కిక్కే వేరు. లేటెస్ట్‌గా బాలీవుడ్ మూవీ `THE VVAAN`లో `తుమ్మక్ తుమ్మక్` అంటూ సాగే పాటలో తమన్నా తనదైన ఎనర్జీ.. గ్రేస్‌తో మరోసారి అదరగొట్టారు. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తుండటం ఆసక్తికరం.
సిద్ధార్థ్ మల్హోత్రా- తమన్నా భాటియా జంటపై ఈ స్పెషల్ పాట షూటింగ్‌కు సంబంధించిన బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సిద్ధార్థ్, తమన్నా తమ అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో స్టేజీని షేక్ చేశారు. ఈ పాటకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌పై నెటిజన్లు, అభిమానుల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి.
ఈ సాంగ్ షూట్ వీడియోపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. తమన్నా అందాన్ని- తన డ్యాన్స్ మూవ్స్‌ను కొనియాడుతూ కొందరు `డ్యాన్సింగ్ క్వీన్`, `మిల్కీ బ్యూటీ` అంటూ కామెంట్లు పెట్టగా....మరికొందరు సిద్ధార్థ్ - తమన్నా జోడీ అద్భుతమైన కెమిస్ట్రీతో అలరించారని పేర్కొన్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ సాంగ్ వైబ్స్, కొరియోగ్రఫీపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ తెరవెనక షూటింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మక్ తుమ్మక్.. కావాలా సాంగ్‌ని మించిన కిక్కు ఇస్తుందా లేదా? అన్నది తెలియాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాల్సి ఉంటుంది. 25 సెప్టెంబర్ ది వివాన్ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
తమన్నా చేసే ప్రతి ఐటమ్ నంబర్ కుర్రకారుకు ప్రత్యేకమైన కిక్కు ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ బ్యూటీ బబ్లీ అందం.. గ్లామర్ అప్పీల్..అంతులేని ఎనర్జీ కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే తమన్నాకు ఇటీవలి కాలంలో సరైన సోలో బ్లాక్‌బస్టర్ హిట్లు లేవు. `బాహుబలి` తర్వాత మళ్లీ `స్త్రీ 2` చిత్రంలో చేసిన స్పెషల్ సాంగ్ మాత్రమే పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన సినిమాలకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు `ది వివాన్` సినిమాపైనే ఈ అందాల భామ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రంతో తనకు మంచి విజయం దక్కాలని కోరుకుందాం.
2026 సంవత్సరంలో తమన్నా తన సినిమాల జోరును కొనసాగిస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ వేదికగా వచ్చే వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. డిజిటల్ మాధ్యమంలోనూ తన క్రేజ్‌ను తగ్గకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.