గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న మలైకా అరోరా!

మలైకా అరోరా.. నటి , డాన్సర్, మోడల్ , వీడియో జాకీ, టెలివిజన్ షోలలో సందడి చేస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.;

Update: 2026-02-05 16:30 GMT

మలైకా అరోరా.. నటి , డాన్సర్, మోడల్ , వీడియో జాకీ, టెలివిజన్ షోలలో సందడి చేస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 1973 అక్టోబర్ 23న మహారాష్ట్ర థానేలో జన్మించింది..ఈమె తల్లి మలయాళీ క్రైస్తవురాలు కాగా.. ఈమె తండ్రి అనిల్ అరోరా ఫాజిల్కాకు చెందిన పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవారు.




అయితే మలైకాకు 11 సంవత్సరాల వయసులోనే ఈమె తల్లిదండ్రులు విడిపోయారు. ఇక దాంతో మలైకా తల్లి మలైకాతో పాటు మలైకా సోదరి అమృతను తీసుకొని చెంబూర్ కి షిఫ్ట్ అయ్యి.. సింగల్ పేరెంట్ గా వీరిని పోషించారు. ఇక అలా తల్లి చాటు బిడ్డగా పెరిగిన మలైకా అరోరా విభిన్నమైన రంగాలలో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని సొంతం చేసుకుంది.




ఒకవైపు నటిగా మరొకవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న మలైకా అరోరా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది.. అందులో భాగంగానే ఈసారి కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిస్తూ.. కొత్త ఏడాది.. మరో కొత్త హెయిర్ స్టైల్ అంటూ కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో ఈమె హెయిర్ స్టైల్ గురించి కాస్త పక్కన పెడితే, ఈమె అందాల ఆరబోత అభిమానులకు చెమటలు పట్టించిందని చెప్పవచ్చు.




బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె ఇందులో టాప్ అందాలు చూపిస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మలైకా అరోరా షేర్ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మలైకా అరోరా నిత్యం తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.. దర్శకుడు, నిర్మాత అయిన అర్భాజ్ ఖాన్ తో కాఫీ యాడ్ షూట్ లో చేసి ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. అయితే వీరికి 2002లో అర్హాన్ ఖాన్ జన్మించారు. కొడుకు జన్మించిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య విభేదాలు ఏర్పడడంతో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవడం జరిగింది.




అయితే కొడుకు పుట్టిన తర్వాత కూడా ఈ జంట విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత 2016లో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. ఆ సమయంలో తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉండడంతో చాలామంది ఈ జంటపై విమర్శలు కూడా గుర్తించారు . అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ 2024లో వీరు ఇద్దరు విడిపోయారు. డినో మోరియాతో సంబంధాన్ని కొనసాగించినట్లు సమాచారం.

ఇకపోతే వయసులో తనకంటే చిన్నవారితో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈమె ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఏది ఏమైనా ఇలా ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News