• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోయిన్స్.. ఇదో...

స్టార్ హీరోయిన్స్.. ఇదో పెద్ద చాలెంజ్ గురు

| మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ నాలుగు, ఐదు భాషలలో తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-10-02 13:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల సందడి ఎక్కువగా నడుస్తోంది. మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ నాలుగు, ఐదు భాషలలో తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ లతో మూవీస్ ని నిర్మిస్తున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేస్తే డిజిటల్ రైట్స్ కూడా భారీ రేట్లకి అమ్ముడవుతాయి. బై లక్ కలిసొచ్చి ఇతర భాషలలో ఆడియన్స్ కి కనెక్ట్ అయితే థీయాట్రికల్ గా సినిమాకి భారీ లాభాలు వస్తాయి.

ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడంపై మన తెలుగు హీరోలు, దర్శకులు ఎక్కువ ఫోకస్ చేశారు. అందుకే కథలని కూడా యూనివర్సల్ అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి హీరోయిన్స్ ఎంపిక అనేది మేకర్స్ కి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా నిలబడినవారు కనీసం దశాబ్దం పాటు తమ హవా కొనసాగించేవారు.

అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఇమేజ్ తెచ్చుకుంటున్నా కూడా ఐదేళ్లకి మించి స్ట్రాంగ్ గా కెరియర్ ని హోల్డ్ చేసుకోలేకపోతున్నారు. కొందరు స్టార్ హీరోయిన్ గా ఎంత స్పీడ్ గా ఎదుగుతున్నారో అంతే వేగంగా అవకాశాలు కోల్పోతున్నారు. రెండు, మూడు ఫ్లాప్ లు పడితే మేకర్స్ వారిని పట్టించుకోవడం లేదు. పూజా హెగ్డే విషయంలో జరిగిందదే. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, రష్మిక మందన లాంటి లీడింగ్ యాక్టర్స ఎక్కువ సినిమాల లైన్ లో పెట్టి బిజీ షెడ్యూల్స్ మెయింటేన్ చేస్తున్నారు.

దీంతో వారి బల్క్ డేట్స్ దొరకడం లేదు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ అయితే తమ పాత్రకి, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉందంటేనే పాన్ ఇండియా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లేదంటే నిర్మొహమాటంగా చేయమని చెప్పేస్తున్నారు. శ్రీలీల, కృతిశెట్టి లాంటి యంగ్ బ్యూటీస్ వరుస ఫ్లాప్ లు అందుకోవడంతో పాన్ ఇండియా సినిమాల కోసం వారిని పరిగణంలోకి తీసుకోవడం లేదు. అందుకే మేకర్స్ భాగ్యశ్రీ, ఇమాన్వి ఇస్మాయిల్ లాంటి కొత్త వారిని వెతికి పట్టుకొస్తున్నారు. ముఖ్యంగా టైర్ 1 హీరోల కోసం హీరోయిన్స్ ను వెతకడం ఇప్పుడు మేకర్స్ కి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అవుతుందనే మాట వినిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీస్ కి స్టార్ హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కూడా మేకర్స్ ఆలోచనలలో పడ్డట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఒకప్పటిలా కాకుండా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గా కెరియర్ ఎంచుకుంటున్న అందాల భామలు చాలా మంది సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కి వెతికి పట్టుకోవడం చాలా ముఖ్యం. అలా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి, తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఇమాన్వి ఇస్మాయిల్ ఏకంగా ప్రభాస్ తో జతకట్టే అవకాశం సొంతం చేసుకుంది. మరి ఆ రూట్లో ఇతర స్టార్స్ కొత్త భామలకు ఏమైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Tags:    
  • Staractress 
  • Filmindustry 
  • Remuneration 
  • Panindiamovie 
  • Tollywoodactress 
  • Staractressremuneration 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS