టాప్ స్టోరి: ఈ కాంబినేషన్లు పాజిబిలిటీ ఎంత?
సౌతిండియాలో పాన్ ఇండియన్ హీరోలు భవిష్యత్ లో ఏ దర్శకులతో పని చేయబోతున్నారు? అంటే ముందుగా పాన్ ఇండియన్ హీరోల్లో గుర్తుకు వచ్చే హీరోల్లో ... ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి పేర్లను పరిశీలించాలి.;
సౌతిండియాలో పాన్ ఇండియన్ హీరోలు భవిష్యత్ లో ఏ దర్శకులతో పని చేయబోతున్నారు? అంటే ముందుగా పాన్ ఇండియన్ హీరోల్లో గుర్తుకు వచ్చే హీరోల్లో ... ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి పేర్లను పరిశీలించాలి. ఈ హీరోలంతా ఫలానా పాన్ ఇండియన్ డైరెక్టర్ తో పని చేస్తే బావుంటుంది అని విశ్లేషించిన వారు పరిశ్రమలో ఉన్నారు.
ఈ ప్రాజెక్టులు ఏవి? భవిష్యత్ లో సాధ్యమయ్యే కాంబినేషన్లు ఏవి? అన్నది ఆరా తీస్తే, అల్లు అర్జున్- రాజమౌళి, రిషబ్ శెట్టి- సుకుమార్, ప్రభాస్- అట్లీ కుమార్, జూనియర్ ఎన్టీఆర్- మణిరత్నం, యష్- అంజలి మీనన్ కాంబినేషన్లకు భవిష్యత్ లో పాజిబిలిటీ ఉందని గెస్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఎనర్జీకి తగ్గ పాన్ ఇండియన్ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దానికోసం బన్ని వైపు నుంచి ప్రయత్నాలు కూడా సాగాయి. కానీ ఎందుకనో ఇంతకాలం కుదరలేదు. అలాగే కాంతార ఫేం రిషబ్ శెట్టితో `పుష్ప` డైరెక్టర్ సుకుమార్ పని చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. ప్రభాస్ ని వందశాతం మాస్ అవతారంలో అట్లీ చూపించే అవకాశాన్ని కాదనలేం. ఇక క్లాస్ డైరెక్టర్ మణిరత్నం ఎన్టీఆర్ లాంటి హీరోతో పని చేస్తే అది మరో లెవల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళ పాపులర్ దర్శకులు అంజలి మీనన్ తో యష్ పని చేస్తారని రూమర్స్ చాలా కాలంగా ఉన్నాయి. అది ఇకపై సాధ్యపడుతుందనే అభిమానులు భావిస్తున్నారు. ఈ రేర్ కాంబినేషన్స్ సెట్ అయితే తెరపై బ్లాస్ట్ అవ్వడం ఖాయమని, బాక్సాఫీస్ వద్ద మళ్లీ రికార్డులు నమోదవుతాయని అభిమానులు, ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బాహుబలి, సలార్, కల్కి 2898 AD వంటి భారీ ఫ్రాంచైజీలలో నటించిన ప్రభాస్ తదుపరి సందీప్ వంగా స్పిరిట్ లో నటిస్తున్నాడు. అటుపై అట్లీ దర్శకత్వంలో నటిస్తే ఎలా ఉంటుంది? అంటే.. దానికి ఆస్కారం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్ల స్పెషలిస్ట్ అట్లీ కుమార్‌తో ప్రభాస్ కలిస్తే అది కచ్ఛితంగా సెన్సేషన్ అవుతుంది. అల్లు అర్జున్ తో సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్న అట్లీ అవకాశమిస్తే, ప్రభాస్ తో సంచలనాలు ఖాయమే.
అల్లు అర్జున్ - ఎస్.ఎస్. రాజమౌళి కలయిక ఎప్పటికి సాధ్యమవుతుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది. రామ్ చరణ్ తో మగధీర తీసినప్పటి నుంచి అల్లు అర్జున్ రాజమౌళిని సంప్రదిస్తూనే ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ సాధ్యపడటం లేదని కథనాలొచ్చాయి. బన్ని అద్భుతమైన ఎనర్జీ, ఫ్లెక్సిబుల్ పెర్ఫామెన్స్ కి రాజమౌళి లాంటి కమర్షియల్ సినిమా కింగ్ యాడైతే ఆ సినిమా రికార్డులు తిరగరాస్తుందనడంలో సందేహం లేదు. బన్నీని లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో రాజమౌళి మరో స్థాయిలో ఆవిష్కరించగలడు.
ఆస్కార్ విన్నింగ్ ఆర్ఆర్ఆర్ లో తన శక్తివంతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఎన్టీఆర్ యాక్షన్ తో పాటు భావోద్వేగాలను పండించగల నిపుణుడు. అతడితో దర్శకదిగ్గజం మణిరత్నం ఓ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఈ జోడీ కలిసి రావడం లేదు. భవిష్యత్ లో ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాలతో భారీ విజయాల్ని అందుకున్న మణిరత్నం తదుపరి కమల్ హాసన్ తో `థగ్ లైఫ్` తో గ్రాఫ్ ని మరింతగా పెంచుకునేందుకు అవకాశం ఉంది. తదుపరి ఎన్టీఆర్ తో ఆయన ప్రాజెక్ట్ సెట్ అయితే అది ఉత్కంఠ పెంచుతుందనడంలో సందేహం లేదు.
కాంతారలో తన శక్తివంతమైన నటనతో రిషబ్ శెట్టి భారతీయ సినిమాలోని అత్యుత్తమ నటులలో ఒకరని నిరూపించుకున్నాడు. ఒక విలేజ్ నేపథ్యంలో జానపద కథలో ప్రజల్ని కదిలించే పాత్రలో రిషబ్ అద్బుతంగా నటించాడు. అతడు `పుష్ప` ఫ్రాంచైజీ వెనుక ఉన్న దార్శనికుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాలో నటిస్తే బావుంటుందనేది అభిమానుల ఆకాంక్ష. భవిష్యత్ లో దీనికి ఆస్కారం ఉంటుందనే ఆశిద్దాం. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లతో అలరిస్తున్న కేజీఎఫ్ స్టార్ యష్ ప్రముఖ కన్నడ ఫిలింమేకర్ అంజలి మీనన్‌తో కలిసి పని చేస్తే ఒక రీఫ్రెషింగ్ కాన్సెప్ట్ వర్కవుటవుతుంది. యష్ ప్రస్తుతం `టాక్సిక్`తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.