వారణాసి నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా?
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' మూవీ విషయంలో కూడా జక్కన్న అదే పంథా అనుసరిస్తున్నారు.;
రాజమౌళి సినిమా అంటేనే లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' మూవీ విషయంలో కూడా జక్కన్న అదే పంథా అనుసరిస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్ చూపించడమే టార్గెట్ గా టీమ్ వర్క్ చేస్తోంది.
సినిమాలో టైమ్ ట్రావెల్ ఉంటుందని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. రామాయణ కాలానికి వెళ్లేలా కూడా ఒక ఎపిసోడ్ హైలెట్ కానుంది. ఇక ఈ భారీ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. మహేష్ బాబు తన పాత్ర కోసం ఫిజికల్ గా చాలా మేకోవర్ అయ్యారు. ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న తరుణంలో షూటింగ్ లొకేషన్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకు వచ్చింది.
కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా షూట్ చేయడానికి ప్లాన్ రెడీ అయ్యింది.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వారణాసి సినిమాకు సంబంధించిన కోకాపేట షెడ్యూల్ దాదాపు పూర్తి కావచ్చింది. దీని తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగే చిన్న షెడ్యూల్ ని ఫినిష్ చేయగానే టీమ్ అంతా విదేశాలకు వెళ్లనుంది. తర్వాతి షెడ్యూల్స్ కోసం జార్జియా తో పాటు ఏకంగా అంటార్కిటికా వెళ్తున్నట్లు సమాచారం.
అంటార్కిటికా మంచు కొండల్లో మహేష్ బాబుపై కొన్ని కీలకమైన సీన్లు షూట్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఒక ఇండియన్ సినిమాను అంటార్కిటికా వంటి ప్రదేశాల్లో షూట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడి వాతావరణాన్ని తట్టుకుని షూటింగ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. కానీ రాజమౌళి విజన్ కి తగ్గట్టుగా అవుట్ పుట్ రావాలంటే అలాంటి లొకేషన్లు తప్పవని టీమ్ భావిస్తోంది. మహేష్ బాబు కూడా ఈ సాహసోపేతమైన షెడ్యూల్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారట. గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే ఇలాంటి లొకేషన్లు సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి.
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. కేవలం మంచు కొండలు మాత్రమే కాకుండా ఆఫ్రికా అడవుల్లో కూడా కొన్ని సీన్లు ఉంటాయని టాక్. అంటే ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుని ప్రపంచాన్ని చుట్టి వచ్చేలా జక్కన్న ప్లాన్ చేశారు. మహేష్ బాబు కెరీర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ కాబోతోంది. షూటింగ్ నాన్ స్టాప్ గా జరిపి అనుకున్న టైమ్ కి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని టీమ్ పట్టుదలగా ఉంది. వారణాసి షూటింగ్ స్పీడ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది. ఇక 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ ఇంకెన్ని వింతలు చూపిస్తుందో చూడాలి.