ఎన్టీఆర్ కోసం మల్టీస్టారర్ వదులుకుంటాడా..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీతో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు.;
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీతో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. జైలర్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన నెల్సన్ మళ్లీ వెంటనే ఆయనతో సీక్వెల్ చేయడం పట్ల సూపర్ ఎగ్జైట్మెంట్ ఏర్పడింది. ఐతే నెల్సన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే తమిళ దర్శకుడు అయిన నెల్సన్ తో మన యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందన్న వార్తలు తెలిసిందే. సితార బ్యానర్ లో ఈ సినిమా ప్లానింగ్ ఉంది.
ఎన్టీఆర్ తో నీల్ భారీ సినిమా,,
ప్రెజంట్ ఎన్టీఆర్ తో నీల్ భారీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక కానీ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ లేదు. ఓ పక్క దేవర 2 ని కూడా ఈసారి పకడ్బందీ ప్లానింగ్ తో సెట్ చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ దేవర 2 మొదలైతే నెల్సన్ ప్రాజెక్ట్ కాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే నెల్సన్ కూడా ఈ గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
రజనీకాంత్, కమల్ హాసన్ కాంబో సినిమా కోసం ఇప్పటికే ఎంతోమంది దర్శకుల పేర్లు చర్చల్లో వచ్చాయి. లోకేష్ కనకరాజ్ నుంచి యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ వరకు ఈ మల్టీస్టారర్ మూవీ చేస్తారన్న టాక్ వినిపించింది. ఐతే తిరిగి తిరిగి అది నెల్సన్ దిలీప్ కుమార్ దగ్గరకు వచ్చిందట. ఆల్రెడీ జైలర్ 2 తో రజనీతో పనిచేస్తున్న నెల్సన్ మళ్లీ ఆయనతోనే సినిమా చేయబోతున్నారట.
నెల్సన్ దిలీప్ కుమార్ ముందు రెండు ఆప్షన్స్..
నెల్సన్ దిలీప్ కుమార్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఒకటి ఎన్టీఆర్ సినిమా కాగా.. మరొకటి ఆ క్రేజీ మల్టీస్టారర్. ఒకవేళ నెల్సన్ తారక్ తో సినిమా ముందు టేకప్ చేస్తే మల్టీస్టారర్ ఛాన్స్ మిస్ అయినట్టే. అందుకే ఎన్టీఆర్ సినిమానే కాస్త టైం తీసుకుని రజనీ, కమల్ మల్టీస్టారర్ ని చేసేలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరోపక్క ఎన్ టీ ఆర్ నీల్ సినిమాతో పాటు దేవర 2 పూర్తి చేశాక త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఈ ఇద్దరి మధ్యలో ఈ ప్రాజెక్ట్ అటు ఇటు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఫైనల్ కన్ ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఫ్యాన్స్ కి ఒక సాలిడ్ మాస్ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మీద ఫుల్ ఫోకస్ తో ఉన్నాడు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఆ సినిమా రిలీజ్ ఉండగా నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా తారక్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని తెలుస్తుంది.