'ధురంధర్ 2' అప్పుడే రికార్డులు మొదలు పెట్టింది!
రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `ధురంధర్`. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.;
రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `ధురంధర్`. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. యదార్థ సంఘటనల ఆధారంగా అత్యంత భారీ స్థాయిలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ మూవీని తెరకెక్కించాడు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టి రణ్‌వీర్‌సింగ్ సినిమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
దీంతో పార్ట్ 2గా రానున్న `దురంధర్2: ది రివేంజ్`పై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఫస్ట్ పార్ట్‌కి మించి భిభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, హార్డ్ కోర్ వైలెన్స్ సీన్‌లతో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిని ఈ సినిమా సెకండ్ పార్ట్ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కి మేకర్స్ అమ్మేయడం తెలిసిందే. ఓన్లీ హిందీ వెర్షన్‌ని మాత్రమే రూ.85 కోట్లకు మేకర్స్ అమ్మేశారు. అయితే పార్ట్ 2ని కూడా ఇదే ఓటీటీకి విక్రయించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నెట్ ఫ్లిక్స్‌ని పక్కన పెట్టిన మేకర్స్ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని జీయో హాట్ స్టార్‌కు ఇచ్చేసి షాక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌పై ఉన్న నమ్మకం వల్లే మేకర్స్ నెట్ ఫ్లిక్స్‌కు కాకుండా జీయో హాట్ స్టార్‌కు ఓటీటీ హక్కుల్ని ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్‌కి రూ.85 కోట్లకు విక్రయించిన మేకర్స్ పార్ట్ 2ని మాత్రం జీయో హాట్ స్టార్‌కి రికార్డు స్థాయి ధరకు రూ.150 కోట్లకు అమ్మేశారట. జియో స్టూడియోస్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యే వరకు సెకండ్ పార్ట్‌కు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ఎవరికీ ఇవ్వొద్దని, హోల్డ్‌లో పెట్టాలని మిగతా మేకర్స్‌ని కోరిందట. అనుకున్నట్టుగానే పార్ట్ 2 ఓటీటీ డీల్‌ని ఆలస్యంగా అమ్మేయాలని ఆదిత్యధర్, లోకేష్ ధర్, జ్యోతీ దేశ్ పాండే భావించి నెట్ ఫ్లిక్స్‌కి అమ్మకుండా హోల్డ్‌లో పెట్టారు.
`ధురంధర్` రిలీజ్ తరువాత పార్ట్ 2పై క్రేజ్ పెరగడంతో దానికి తగ్గట్టుగా డిమాండ్ చేశారట. అయితే నెట్ ఫ్లిక్స్ వెనక్కి తగ్గడంతో జీయో హాట్ స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల్ని రూ.150 కోట్లకు రికార్డు స్థాయి మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే పార్ట్ 2లో సర్‌ప్రైజ్ గెస్ట్ క్యారెక్టర్లు చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ముంబయి బాంబు పేళుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.