“ప్రొడ్యూసర్ కంటే హీరోలే ఎక్కువ!”.. మ్యూజిక్ డైరెక్టర్ సరదా స్టేట్‌మెంట్ వైరల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రబృందాన్ని నిహారిక కొణిదెల సరదాగా ఇంటర్వ్యూ చేశారు. వరుణ్ తేజ్, కమేడియన్ సత్య, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్న ఈ చిట్ చాట్‌లో తమన్ చేసిన ఓ ఫన్నీ వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది..
నిహారిక సరదా మీమ్స్ ఇంటర్వ్యూ:
ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో ఆమె మూవీ టీమ్‌తో భిన్నంగా ముచ్చటిస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను మీమ్స్ రూపంలో చెప్పాలని కోరింది.షూటింగ్ పూర్తి కావొస్తున్న సమయంలో వరుణ్ తేజ్‌కు కాలికి గాయమైందని, ఆ సమయంలో డాక్టర్లు రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఏమనిపించిందో మీమ్స్ ద్వారా చెప్పాలంటూ నిహారిక ప్రసిద్ధ సినిమాల కామెడీ మీమ్స్‌ను సరదాగా ప్రదర్శించారు.
తమన్ కామెంట్.. 'రెండు నెలలు బ్రేక్ దొరికింది':
వరుణ్ తేజ్ కాలి గాయం గురించి తమన్ స్పందిస్తూ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని జయప్రకాశ్ నవ్వుల మీమ్‌ను చూపించారు. "వరుణ్‌కి కాలి ఇంజ్యూరీ అయిందని తెలిసి నేను నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అబ్బా నాకు 2 నెలలు బ్రేక్ దొరికింది అనుకున్నా! లేకపోతే స్టూడియోకి ప్రొడ్యూసర్ కంటే హీరో, డైరెక్టరే ఎక్కువగా వచ్చేవాళ్లు" అంటూ నవ్వులు పూయించారు.
సత్య పాట.. సెవెన్ బై జీ మీమ్స్ హంగామా: ఈ ఇంటర్వ్యూలో తమన్ మ్యూజిక్ కంపోజిషన్‌లో కమేడియన్ సత్య పాట పాడి అలరించారు. సత్య కూడా ‘సెవెన్ బై జి బృందావన్ కాలనీ’ చిత్రంలోని ఓ ఫన్నీ మూమెంట్‌ను మీమ్ రూపంలో చూపిస్తూ ఆకట్టుకున్నారు. ఇక వరుణ్ తేజ్, నిహారికల మధ్య జరిగిన సరదా సంభాషణలు, జులాయి మూవీ మీమ్స్ వాడకంతో ఇంటర్వ్యూ అంతా ఎంతో వినోదాత్మకంగా సాగింది.
బాక్సాఫీస్ వద్ద కొరియన్ కనకరాజు హవా:
ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ, వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్, తమన్ సంగీతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
వైరల్ అవుతున్న ప్రోమో:
సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్న చిత్రబృందం ఇలా సరదాగా మీమ్స్ రూపంలో సందడి చేయడం అభిమానులకు బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ల కంటే హీరోలే ఎక్కువ వచ్చేవాళ్లంటూ తమన్ చేసిన సెటైరికల్ కామెంట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.