'టాక్సిక్' వేదికపై యష్ భామల గ్లామర్ హంగామా: షోస్టాపర్ 'నయన్' శారీ లుక్!
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మైండ్ బ్లోయింగ్ గ్లామర్‌తో అత్యంత సందడిగా సాగింది.
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మైండ్ బ్లోయింగ్ గ్లామర్‌తో అత్యంత సందడిగా సాగింది. చిత్రంలో నటించిన భామలు నయనతార, కియారా అద్వాణీ, తారా సుతారియా , రుక్మిణి వసంత్ ఒకే వేదికపైకి వచ్చి సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో కన్నుల పండుగ చేశారు. వేదికపై తమ అందచందాలు, అదిరిపోయే డ్రెస్సింగ్ సెన్స్ .. చక్కటి వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నారు.
ఈ ఈవెంట్‌లో షో స్టాపర్‌గా నిలిచింది మాత్రం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ సీనియర్ నటి ధరించిన సాంప్రదాయ ఆరెంజ్ సిల్క్ శారీ ,అల్ట్రా మోడ్రన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో తోడై రాయల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో గుబులు రేపింది,. పర్‌ఫెక్ట్ హెయిర్ స్టైల్, ట్రెండీ నెక్‌పీస్‌తో నయన్ అల్ట్రా-మోడ్రన్ శారీ లుక్ పాత తరం రాయల్టీకి - నేటి తరం మోడ్రన్ స్టైల్‌కి మధ్య చక్కటి కలబోతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.
మరొకవైపు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ తన స్టైలిష్ ప్రెజెన్స్‌తో వేడుకలో ప్రత్యేక లైట్నింగ్ మెరుపుల్ని వెదజల్లింది. వైట్ కలర్ ఆఫ్-షోల్డర్ కార్సెట్ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోయిన కియారా తన గ్రేస్‌ఫుల్ ప్రెజెన్స్ -బోల్డ్ గ్లామర్‌తో స్టేజ్‌పై రచ్చ చేసింది. కియరా లుక్ ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఈవెంట్‌కి ప్రధాన ఆకర్షణగా మారాయి.
వీరితో పాటు ఈవెంట్‌లో పాల్గొన్న తారా సుతారియా వన్-షోల్డర్ బ్లాక్ డిజైనర్ అటైర్‌లో క్లాసీ , హై-ఫ్యాషన్ లుక్‌లో కట్టుబడేలా కనిపిస్తే,.. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎంతో సింపుల్అండ్ క్యూట్ అవుట్‌ఫిట్‌లో ట్రెండీగా అలరించింది. ప్రతి కథానాయిక తమ డిజైనర్ వేర్స్‌తో వేదికకు అసలైన గ్లామర్ కంటెంట్ ని జోడించి ఈవెంట్‌ను అత్యంత రంగులమయంగా మార్చేశారు.
కేవలం డ్రెస్సింగ్ సెన్స్ మాత్రమే కాకుండా వేదికపై అభిమానులతో సంభాషించిన విధానం, తోటి నటీనటులతో ఉన్న అనుబంధం.. వారి ఆకట్టుకునే మాటతీరు ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చాయి,. మొత్తానికి `టాక్సిక్` వేదికపై ఈ బ్యూటీలు గ్లామర్ ఫీస్ట్ అభిమానులకు - సినీ ప్రియులకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించింది. ఇక థియేటర్లలో టాక్సిక్ సినిమా వీక్షించే అభిమానులకు గ్లామర్ ధమాకా ట్రీట్ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు.