స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భూమిక.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2026-02-05 11:57 GMT

ప్రముఖ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు సింహాద్రి, ఖుషి, ఒక్కడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. మధ్యలో వివాహం చేసుకొని కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.. మళ్లీ కొంతకాలం గ్యాప్ తీసుకున్న భూమిక.. ఇప్పుడు మళ్లీ తన కెరియర్ లో ఒక్కడు లాంటి మరిచిపోలేని సూపర్ హిట్ విజయాన్ని అందించిన దర్శకుడు గుణశేఖర్ తో కలిసి యుఫోరియా సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ విడుదల అవ్వగా.. అప్పటి నుంచే భూమిక పాత్ర పై ఆసక్తి పెరిగింది

ముఖ్యంగా టీజర్ చూస్తేనే మనకు ఈ చిత్రంలో భూమిక కీలకమైన భావోద్వేగాలు ఎక్కువగా పండించే పాత్ర చేస్తోందని అర్థమవుతోంది..నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కథలో ఆమె పాత్ర చాలా బలంగా ఉండడంతో ఆమె పాత్రను తెరపై చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే రేపు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా యూఫోరియా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.. ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కలచివేసింది. ఇకపోతే సడన్గా భూమిక లైవ్లో కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని చూస్తే.. ప్రెస్ మీట్ లో భాగంగా భూమిక మాట్లాడుతూ.." ఇది చాలా బోల్డ్ సబ్జెక్టు. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. రిస్కు కూడా తీసుకోవాలి. నిన్న సినిమా చూసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను" అంటూ కంటతడి పెట్టుకుంది భూమిక . మొత్తానికి అయితే ఇలా లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె అభిమానులు ఈ పాత్ర ఎంత బలంగా ఉందో అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు సినిమా కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే రేపు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో హైదరాబాదులో ఎంపిక చేయబడ్డ థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రీమియర్ షో ఈరోజు రాత్రికి వెయ్యనున్నారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇటీవల హిందీలో ధురంధర్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ హీరోయిన్ సారా అర్జున్ కీలకపాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు ధురంధర్ సినిమాతో హీరోయిన్గా అవతరించి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఈమెతోపాటు భూమిక చావ్లా , గౌతమ్ మీనన్ , పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించార. సామాజిక అంశాల మేళవింపుతో రాబోతున్న ఈ సినిమా రేపు థియేటర్లలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News