మరో ప్రయోగానికి అలియాభట్ సిద్దం!
నెటి జనరేషన్ బాలీవుడ్ హీరోయిన్లందరిలో అలియాభట్ ప్రత్యేకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.;
నెటి జనరేషన్ బాలీవుడ్ హీరోయిన్లందరిలో అలియాభట్ ప్రత్యేకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది హీరోయిన్లు..వారసులు పరిశ్రమలో ఉన్నా? అలియాభట్ మాత్రం వారందరీ కంటే ఓ మెట్టుపైనే ఉంది అన్నది కాదనలేని నిజం. ఆమె ఎంపిక చేసుకుంటోన్న పాత్రలు సహా పెర్పార్మెన్స్ మాత్రమే అమ్మడిని ఆ స్థానంలో కూర్చోబెట్టాయి. కమర్శియల్ చిత్రాలైనా? ప్రయోగాత్మక పాత్రలైనా? గంగూబాయి లాంటి లేడీ డాన్ రోల్ అయినా అవలీలగా పోషించగలదని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. గ్లామర్ పాత్రల పరంగా అలియా అభినయం గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
'ఆల్ఫా' లాంటి చిత్రానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ప్రత్యేకంగా అలియాభట్ నే స్పై పాత్రకు ఎంపిక చేసిదంటే? అలియా ఎంత గొప్ప పెర్పార్మర్ కాకపోతే ఛాన్స్ ఇస్తారు. ఆ రూపంలో మరోసారి అలియా ఎంతటి ప్రతిభావంతురాలు అన్నది ప్రూవ్ అయింది. గంగూబాయి కతివాడిలో గంగూబాయిగా ఓ సంచలనమే సృష్టించింది. లేడీ డాన్ గెటప్ లో అమ్మడి మాస్ అప్పిరియన్స్ కి ఫిదా కాని వారుండరు. అంతటి ప్రతి భావంతురాలు కావడంతో? ఈ సారి మరో ప్రయోగానికి రెడీ అయింది.
అందుకు అన్ని రకాలుగా అర్హురాలిగా భావించే దర్శకుడు అభిషేక్ పాఠక్ తన సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపిక చేసాడు. అలియాభట్ ప్రధాన పాత్రలో `హౌస్ వైఫ్` అనే ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు పాఠక్. వివాహమైన ఓ జంట చుట్టూ తిరిగే కథ ఇది. ఈ రిలేషన్ షిప్ డ్రామాలో మరో కీలక పాత్రకు నేచురల్ పెర్పార్మర్ రాజ్ కుమార్ రావ్ ని తీసుకుంటున్నారు. ఆయనకు భార్య పాత్రలోనే అలియాభట్ కనిపించనుంది. అయితే ఈ భార్యాభర్తల్ని అభిషేక్ పాఠక్ చాలా బోల్డ్ గా చూపించబోతున్నాడు? అన్నది హైలైట్ అంశం.
నాలుగు గోడల మధ్య ఉండే భార్యభర్తల రహస్య బంధాన్ని ఎంతో బోల్డ్ గా చూపించబోతున్నాడట. లస్ట్ స్టోరీలు సహా బాలీవుడ్ బోల్డ్ యాంగిల్ ని మించి రిలేషన్ షిప్ లో ఘాడతను చూపించబోతున్నాడని మీడియాలో ప్రచారం జరుగుతోంది. భర్త పాత్రను రాజ్ కుమార్ రావ్ పోషించిన భార్య పాత్రలో? అలియాభట్ ఆద్యంతం హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ జానర్ వెండి తెరకు కొత్తేం కాదు. కాకపోతే? ఆ బంధాన్ని పరిమితం మేర మాత్రమే చూపించారు. ఓ క్లాసిక్ చిత్రాలుగానే ఆ జానర్ హైలైట్ అయింది. కానీ అభిషేక్ పాఠక్ అంతకు మించి ఏదో చెప్పబోతున్నడని తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్ వివాదాస్పదం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయన్నది అంతే వాస్తవం.