క్రేజీ సిరీస్‌కు ప్రీక్వెల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
యువతని విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో అత్యంత పాపులార్ అయిన సిరీస్ మీర్జాపూర్`.;
యువతని విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో అత్యంత పాపులార్ అయిన సిరీస్ మీర్జాపూర్`. పంకజ్ త్రిపాఠీ, అలీ జాఫర్, విక్రాంత్ మస్సే, దివ్యేందు శర్మ, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి, కుల్భూషన్ కర్బందా, శ్రియా పిల్గావ్‌కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మూడు సిరీస్‌లుగా విడుదలై అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టింటించింది. ఇందులో నటించిన పంకజ్ త్రిపాఠీ, విక్రాంత్ మస్సే, దివ్యేందు శర్మ, శ్రియా పిల్గావ్‌కర్ దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ సిరీస్ సినిమాగా రానున్న విషయం తెలిసిందే. `మీర్జాపూర్ ది ఫిల్మ్` పేరుతో దీన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్‌ని ఇటీవలే ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్లాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో సంచలనం సృష్టించి వెబ్ సిరీస్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇండియన్ సిరీస్‌లలో సరికొత్త చరిత్ర సృష్టించి ప్రేక్షకుల్ని ఓటీటీల వైపు దృష్టి సారించేలా చేసింది.
ఇప్పుడు సినిమాగా వస్తుండటంతో దీని కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రికార్డు స్థాయిలో ఆరు నెలల్లోనే సినిమాని మేర్స్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్‌ల సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది, అంతే కాకుండా మూడు సిరీస్‌లలో చనిపోయిన వారంతా సినిమాలో కనిపిస్తారని చెప్పడంతో అంతా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన మీర్జాపూర్ సిరీస్‌లకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ సీజన్ 2018 నవంబరు 16 నుంచి అమెజాన్ ప్రమైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. దానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ఉత్సాహంతో రెండవ సిరీస్‌ని 2020 అక్టోబర్ 23న రిలీజ్ చేశారు. అది కూడా విపరీతమైన ఆదరణని సొంతం చేసుకుని ఓటీటీలో బిగ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దీంతో మూడవ సిరీస్‌ని 2024, జూలై 5న విడుదల చేశారు. దీనికి కూడా మంచి ఆదరణ లభించడంతో `మీర్జాపూర్`పై ఏర్పడిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇప్పుడు ప్రీక్వెల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.