అత్యంత దుర్భర జీవితంలో స్టార్ హీరో తమ్ముడు!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరుడు హైదర్ అలీ ఖాన్ జీవితం అత్యంత దుర్భర స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరుడు హైదర్ అలీ ఖాన్ జీవితం అత్యంత దుర్భర స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తినడానికి తిండి కూడా దొరకని కఠిన పరిస్థితుల్లో హైదర్ ఉన్నట్లు కనిపిస్తుంది. హైదర్ ఓ సాధారణ చాల్‌లో జీవిస్తున్నట్లు ఆయన మాజీ భార్య, టెలివిజన్ నటి ఇవా గ్లోవర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. `కరిష్మా కా కరిష్మా`, `శరారత్`, `బడే అచ్చే లగ్తే హై` వంటి పలు పాపులర్ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇవా గ్లోవర్ వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను.. హైదర్ అలీ ఖాన్ ప్రస్తుత దుస్థితిని బహిర్గతం చేశారు.
ఇవా గ్లోవర్ హైదర్ అలీ ఖాన్‌ల మధ్య పరిచయం 18 రోజుల్లోనే ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లారు. ఇవా తల్లి ఈ పెళ్లికి వ్యతిరేకించడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన మూడో రోజు నుంచే తమ కాపురంలో హింస ప్రారంభమైందని ఇవా పేర్కొన్నారు. హైదర్ అలీ ఖాన్ స్కిజోఫ్రానియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని.. పెళ్లి సమయంలో తనకు ఈ విషయం అసలు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్ల వివాహ జీవితంలో హైదర్ విపరీతమైన శారీరక హింసకు పాల్పడ్డారని ఇవా సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్‌మెట్ సమయంలోనూ ఆయన తనపై దాడి చేశారని.. దీనివల్ల ఒంటిపై గాయాలయ్యేవని గుర్తు చేసుకున్నారు. హైదర్ అధికంగా మద్యం సేవించడం వల్ల అతని మానసిక పరిస్థితి మరింత దిగజారిందని, అనవసరమైన అనుమానాలతో తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాడని ఆరోపించారు. ఎన్నిసార్లు హింసను భరించాల్సి వచ్చినా? పరిస్థితులు మారుతాయనే ఆశతో ఆ బంధాన్ని కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించానన్నారు.
అయితే కుమార్తె పుట్టిన తర్వాత పరిస్థితులు మరింత క్షీణించడంతో విడాకుల ప్రక్రియ మొదలైంది . ఇవాను తిరిగి ఆమె పుట్టింటికి పంపించేశారు. ఈ వివాహ బంధం నేపథ్యంలో అమీర్ ఖాన్ కుటుంబానికి సంబంధించిన పలు విషయాలు కూడా చర్చకొచ్చాయి. అమీర్ ఖాన్‌కు ఈ వివాదం గురించి ముందే తెలుసని.. ఈ పెళ్లి విషయంలో ఇవా సరైన నిర్ణయం తీసుకోలేదని అమీర్ భావించినట్లు తనకు సమాచారం అందిందని ఇవా తెలిపారు. అప్పట్లో హైదర్ తండ్రి తాహిర్ హుస్సేన్‌తో కూడా అమీర్ పెద్దగా సంబంధాలు పెట్టుకోలేదని ఇలా వెల్లడించారు.
గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మానవతా దృక్పథంతో ప్రస్తుతం హైదర్ అలీ ఖాన్ పడుతున్న ఇబ్బందులను చూసి ఇవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు హైదర్ వద్ద నివాసానికి ఇల్లు కూడా లేదని.. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. ఎవరో ఒకరి దయ వల్ల చాల్‌లో తలదాచుకుంటున్నారని చుట్టూ మద్యం అలవాటు ఉన్న వ్యక్తులు ఉండటం వల్ల హైదర్ ని పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరా జీవితం ఇలా మారడం పట్ల తాను విచారిస్తున్నట్లు తెలిపారు.
ఒకప్పుడు బాలీవుడ్ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిగా మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తిగా మెరిగిన హైదర్ అలీ ఖాన్ నేడు ఒంటరిగా, అనారోగ్యంతో, ఆదరణ కరువై దుర్భర జీవితం గడపడం కలిచివేస్తోంది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ వెంటాడుతున్నప్పటికీ మాజీ భార్యగా ఆమె వ్యక్తం చేసిన సానుభూతి ఈ ఉదంతంలో మరో కోణాన్ని కళ్లకు కడుతోంది.