విదేశీ వీధుల్లో మినీ ఫ్రాక్ తో సందడి చేస్తున్న రీతూ వర్మ!
తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విదేశీ వీధుల్లో సందడి చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి, ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన రీతు వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈమె.. తన చిరునవ్వుతోనే అభిమానుల హృదయాలను దోచుకుంటుందనటంలో సందేహం లేదు. నిత్యం ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విదేశీ వీధుల్లో సందడి చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మిస్ సెల్ఫ్రిడ్జ్ మ్యాక్సీ డ్రెస్ ధరించిన ఈమె విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ అక్కడి విదేశీయులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇక మరికొన్ని ఫోటోలలో షార్ట్ ఫ్రాక్ ధరించి మంత్రముగ్ధుల్ని చేసింది. అంతేకాదు అక్కడి ప్రదేశాలను ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకి క్యాప్షన్ గా.." కొన్ని ప్రదేశాలను మనం విడిచి వెళ్లినప్పటికీ అవి ఇంకా మనతోనే ఉన్నాయి అనే భావన కలుగుతుంది" అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి విదేశీ వీధిలో చక్కర్లు కొడుతున్న ఈమె.. తన చిట్టి పొట్టి బట్టలతో అక్కడివారిని ఆకట్టుకోవడమే కాకుండా ఆ ప్రాంతాలను ఫాలోవర్స్ కి చూపిస్తూ మరింత వైరల్ అయింది.
ఇదిలా ఉండగా.. మరొకవైపు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తో రహస్యంగా రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లావణ్య - వరుణ్ తేజ్ పెళ్లిలో సందడి చేసిన ఈమె.. అప్పటి నుంచే వైష్ణవ్ తేజ్ తో పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది అని వార్తలు వినిపించాయి. అయితే ఆ మధ్యకాలంలో వైష్ణవ్ తేజ్ స్పందిస్తూ.. రీతు వర్మ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టారు. ఆ తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు రీతూ వర్మ - వైష్ణవ్ తేజ్. దీనికి తోడు అప్పుడప్పుడు రీతూ వర్మ సినిమాలు ప్రకటిస్తోంది. కానీ 2023 తర్వాత వైష్ణవ్ తేజ్ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రకటించలేదు.
ఇకపోతే గత కొంతకాలంగా వైష్ణవ్ తేజ్ రీతు వర్మలు కనిపించకపోయేసరికి వీరిద్దరి మధ్య బ్రేకప్ అంటూ మరికొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇలా వార్తలు వస్తున్న సమయంలో సడన్గా రీతు వర్మ ఒక కొత్త పోస్ట్ పెట్టి.."కొత్త ప్రయాణానికి ప్రారంభం" అంటూ క్యాప్షన్ జోడించడం.. దానికి వైష్ణవ్ తేజ్ లైక్ కొట్టడంతో ఇక నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు కానీ తమ బంధాన్ని రహస్యంగా మైంటైన్ చేస్తున్నారు కచ్చితంగా ఏదో ఒక రోజు రివిల్ చేస్తారు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కథలు వింటున్నారని వార్తలు రాగా.. ఇటు రీతు వర్మ గోపీచంద్ హీరోగా నటిస్తున్న భరతవర్ష అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఒక గిరిజన యోధురాలి పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.