టాలీవుడ్ లో షారుక్...తార‌క్ త‌ర‌హా స్ట్రాట‌జీ!

కానీ సౌత్ లో అంత ప్ర‌భావం లేదు. షారుక్ సినిమాలు త‌మిళ‌నాడు లో కొన్ని ఆడుతుంటాయి. కానీ మిగ‌తా చోట్ల అంత ప్ర‌భావం ఉండ‌దు.;

Update: 2025-06-20 06:15 GMT

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌మైత్రీ మూవీ ఓ సినిమాకు ఒప్పందం చేసు కుంటుంద‌ని కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. షారుక్ ఖాన్ కు అడ్వాన్స్ గా కొంత మొత్తాన్ని చెల్లించిన‌ట్లు వినిపిస్తుంది. మైత్రీ సంస్థ విష‌యంలో షారుక్ కూడా అంతే పాజిటివ్ గా ఉన్నార‌ని వార్త‌లొస్తున్నాయి. తాజాగా ఇద్ద‌రి మ‌ద్య ఈ డీల్ కుదిరిన‌ట్లు మ‌రోసారి మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

మైత్రీ సంస్థ నిర్మించిన 'పుష్ప' పాన్ ఇండియాలో సాధించిన విజ‌యం...ఆ సినిమా ప‌బ్లిసిటీకి షారుక్ ఖాన్ ఫిదా అయ్యారుట‌. ఈ సంస్థ‌లో సినిమా చేస్తే బాగుంటుంద‌ని షారుక్ ఖాన్ కూడా అన్ని ర‌కాలుగా పాజిటివ్ గా ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇదే నిజ‌మైతే సౌత్ లో ఎంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యంగా ఆయ‌న భావి స్తున్న‌ట్లే. హిందీ మార్కెట్ ప‌రంగా షారుక్ ఖాన్ పెద్ద స్టార్. విదేశాల్లో సైతం మార్కెట్ ఉన్న న‌టుడు.

కానీ సౌత్ లో అంత ప్ర‌భావం లేదు. షారుక్ సినిమాలు త‌మిళ‌నాడు లో కొన్ని ఆడుతుంటాయి. కానీ మిగ‌తా చోట్ల అంత ప్ర‌భావం ఉండ‌దు. తెలుగు సినిమా పాన్ ఇండియా ని దాటి పాన్ వ‌ర‌ల్డ్ ని రీచ్ అవుతోన్న సమ యంలో సౌత్ లో లాంచ్ అవ్వ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే 'వార్ 2' తో హృతిక్ రోష‌న ఎంట్రీ ఇస్తున్నారు. ఇంది హిందీ సినిమా అయినా అందులో టాలీవుడ్ స్టార్ తార‌క్ హీరోకి ధీటుగా ఉండే పాత్ర పోషించ‌డంతో? ఓ తెలుగు సినిమాలా ప్ర‌మోట్ అవుతుంది.

స‌రిగ్గా ఇదే స్ట్రాట‌జీతో షారుక్ కూడా సౌత్ ఎంట్రీ ప్లానింగ్ క‌నిపిస్తుంది. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌నే ప్ర‌చారం ఉంది. కానీ అందులో నిజమెంతో తెలియ‌దు. షారుక్ సినిమా చేస్తే గ‌నుక ఆ సిని మాకు తెలుగు డైరెక్ట‌రే ప‌నిచేస్తాడు. అద‌నంగా తెలుగు స్టార్లు అందులో యాడ్ అయ్యే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News