ప్రభాస్, పవన్ కు రిషబ్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-01 03:45 GMT

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రాబోతున్న ఆ సినిమాకు రిషబే దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ రూపొందిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కాంతార ప్రీక్వెల్.. పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనుంది. తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా.. నిన్న రాత్రి విజయవాడలో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ వేడుకకు రిషబ్ శెట్టి సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రిషబ్ శెట్టి.

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ తెలుగు వెర్షన్ ను ప్రభాస్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్.. హైదరాబాద్ ఈవెంట్ కు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. అయితే ఎన్టీఆర్ ను సహోదరుడు అంటూ తన అభిమానాన్ని చూపించిన రిషబ్.. ప్రభాస్ డార్లింగ్ అంటూ సంబోధించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లను అనుమతులు ఇచ్చినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు థ్యాంక్స్ చెప్పారు రిషబ్. అయితే జీవో కోసం మూవీ మేకర్స్.. సర్కార్ ను విన్నవించుకోగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డబ్బింగ్ సినిమాకు ఎందుకు పెంచడమని అనేక మంది క్వశ్చన్ చేశారు. అసలు పర్మిషన్ ఇవ్వదని అన్నారు.

సినీ వర్గాలు కూడా కర్ణాటకలో తెలుగు సినిమాల విషయంలో జరిగిన వాటిని దృష్టికి తీసుకెళ్లాయి. కానీ పవన్ కళ్యాణ్ రంగంలో దిగి.. మంచిగా ఆలోచించాలని చెప్పారు. అక్కడ జరిగినవి గుర్తుపెట్టుకుని ఇక్కడ ప్రోత్సహించడం ఆపొద్దని సూచించారు. ఆటంకాలు కల్పించొద్దని కోరారు. తద్వారా కాంతార ప్రీక్వెల్ కు అనుమతులు వచ్చే చేశారు. అందుకే రిషబ్ ఇప్పుడు ఈవెంట్ లో కృతజ్ఞత చాటుకున్నారు.

Tags:    

Similar News