'డ్యూడ్' హీరో..టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్స్ ఫీలయ్యారా?
సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఫలానా వారే హీరోగా నటించాలి.;
సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఫలానా వారే హీరోగా నటించాలి. అలా ఏస్తేనే బిజినెస్ జరుగుతుంది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. లేదంటే బిజినెస్ జరగదు..ప్రేక్షకులు థియేటర్లకు రారు అనే మాటలు నిత్యం వినిపిస్తూ ఉండేవి. అప్పట్లో బిజినెస్ స్టార్ల చుట్టే తిరిగేది కాబట్టి ఎవరూ స్టార్స్ లేకుండా మిగతా వారితో సినిమాలు చేయడానికి సాహసించే వారు కాదు. అయితే ఓటీటీల ప్రభావం మొదలైన దగ్గరి నుంచి ప్రేక్షకుల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
స్టార్ ఉన్నాడా? లేడా? అన్నది ఇప్పుడు ఎవరు చూడటం లేదు. కంటెంట్ బాగుందా? ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ బాగుందా? అన్నది మాత్రమే చూస్తున్నారు. అలా కంటెంట్ ప్రధానంగా రూపొందిన సినిమాలని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లు చేస్తున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. అలా కంటెంట్ ప్రధానంగా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలు ఇటీవల చాలానే ఉన్నాయి. అయితే కంలెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు ఇప్పుడు హీరోయిన్ సమస్య వేధిస్తోంది. కొంత మంది యంగ్ హీరోలు హీరోలు తమతో కలిసి నటించడానికి ఆసక్తిని చూపకపోవడంతో చాలా ఫీలయ్యారట.
తమిళ క్రేజీ డైరెక్టర్స్, కమ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, అభిషన్ జీవింత్. ఈ ఇద్దరూ ముందు డైరెక్టర్స్‌గా ప్రూవ్ చేసుకుని బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్‌గా పాపులర్ కావడం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ `కోమాలి` మూవీతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ `లవ్ టుడే`తో హీరో అయ్యాడు. అయితే `లవ్ టుడే` స్క్రిప్ట్‌ని పట్టుకుని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంనీల చుట్టు తిరిగి ఒకే చేయించుకున్నాడు. కానీ హీరో తానే అని చెప్పడంతో ఏ ప్రొడక్షన్ కంపనీ అందుకు అంగీకరించలేదు. పైగా తనతో కలిసి నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాదని చెప్పడంతో ప్రయత్నించడం ఆపని ప్రదీప్ ఏసీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వారిని ఫైనల్‌గా ఒప్పించాడట.
అయితే అందులో తానే హీరో అని చెప్పినప్పుడు ఏజీఎస్ సంస్థ ముందు అంగీకరించలేదని, ఆ తరువాతే ఓకే చేసిందట. కానీ ఈ ప్రాజెక్ట్ అంత ఈజీగా ముందుకు వెళ్లలేదట.. ఏ హీరోయిన్ ముందుకు రాలేదట. ఫైనల్‌గా మలయాళంలో చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేస్తూ నటిగా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇవానని ఎంపిర చేసుకోవాల్సి వచ్చిందట. అలా మొదలైన `లవ్ టుడే` తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా మేకర్స్‌కి ఏకంగా రూ.100 కోట్లు వచ్చేలా చేసి ఆశ్చర్యపరిచింది.
ఇదే తరహాలో `టూరిస్ట్ ఫ్యామిలీ` డైరెక్టర్ అభిశన్ జీవింత్ హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకోవడమే కాకుండా ఫస్ట్ మూవీతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీతో లభించిన క్రేజ్ కారణంగా అతనికి హీరోగా నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అదే `విత్ లవ్`. సౌందర్య రజనీకాంత్ మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్‌తో కలిసి ఈ మూవీని నిర్మించింది. అబిషన్ హీరో ఓకే కానీ హీరోయిన్ ఎవరన్నది సమస్యగా మారిందట.
అతను హీరో అంటే నటించడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రాలేదట. ఆ సమయంలోనే మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న అనస్వరరాజన్‌ని ఈ మూవీ కోసం హీరోయిన్‌గా ఫైనల్ చేసుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుని మంచి పేరు తెచ్చి పెట్టింది. అయినా సరే తను తన తదుపరి మూవీలో హీరోయిన్ కోసం స్ట్రగుల్ పడుతున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ పోడ్ కాస్ట్‌లో తమిళ నటుడు, `సార్` ఫేమ్ కెన్ కరుణాస్ వెల్లడించి షాక్ ఇచ్చాడు. తాను చేసిన `యూత్ ` మూవీ విషయంలోనూ ఇదే తరహా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని, తన లాగే ప్రదీప్ రంగనాథన్, అభిశన్ జీవింత్ కూడా ఎదుర్కొన్నారని వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.