కపూర్ గాళ్ ఇలాగే ఉంటే కెరీర్ ఖతమ్
శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో తనదైన రెబలిజం ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తోంది.;
శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో తనదైన రెబలిజం ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా తన ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తూ, బోల్డ్ కట్స్ ఉన్న దుస్తుల్లో ఖుషీ ఇచ్చిన ఫోజులు తనలోని గ్లామర్ యాంగిల్‌ను కొత్తగా ఆవిష్కరించాయి. `ది ఆర్చీస్` సినిమాతో నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు తనను తాను ఒక పూర్తిస్థాయి కమర్షియల్ హీరోయిన్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ రేంజ్ ఫోటోషూట్లను ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఖుషీకి ఎన్ని అవకాశాలు వస్తున్నా, ఇప్పటివరకూ సరైన `లక్` కలిసి రాలేదనే చెప్పాలి. మొదటి సినిమా ఓటిటి (OTT) కే పరిమితం అవ్వడం.. అందులో తన నటనకు మిశ్రమ స్పందన రావడం ఖుషీ కెరీర్‌పై ప్రభావం చూపింది. అక్క జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో నిలదొక్కుకోగా.. ఖుషీ మాత్రం ఇంకా తనకంటూ ఒక బలమైన ముద్ర వేయడానికి స్ట్రగుల్ అవుతోంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌ను నమ్ముకుంటే కెరీర్ ముందుకు సాగదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ గ్లామరస్ ఫోటోషూట్లు ఖుషీ కెరీర్‌ను ఎలా కాపాడగలవు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం.. మేకర్స్ దృష్టిలో పడటానికి గ్లామర్ షో ఒక సులువైన మార్గంగా మారింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి.. పెద్ద హీరోల సరసన అవకాశాల కోసం ఇలాంటి ఫోటోషూట్లు ఒక రకమైన విజిటింగ్ కార్డ్ లా పనిచేస్తాయి. ఖుషీ తన రెబలిజం ద్వారా తను కేవలం సాఫ్ట్ రోల్స్ మాత్రమే కాదు.. బోల్డ్ క్యారెక్టర్లు కూడా చేయగలనని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది.
కానీ.. చివరగా నటిగా నిలబడాలంటే కేవలం అందచందాలు మాత్రమే సరిపోవు. సరైన కథలను ఎంచుకోవడం, తన నటనను మెరుగుపరుచుకోవడం ఖుషీకి అత్యంత కీలకం. ఈ గ్లామర్ జిమ్మిక్కులు ఒక స్థాయి వరకు క్రేజ్ తెచ్చిపెట్టగలవు కానీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే పెర్ఫార్మెన్స్ మాత్రమే తనను కాపాడగలదు. మరి ఈ రెబలిజం ఖుషీకి నెక్స్ట్ లెవల్ ఆఫర్స్ తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, నాదనియాన్, లవ్ టుడే చిత్రాలు ఫ్లాపులుగా మిగిలాయి. ప్రస్తుతం శ్రీదేవి నటించిన మామ్ మూవీ సీక్వెల్ లో నటిస్తోందని కథనాలొస్తున్నాయి. కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తో మరికొన్ని చిత్రాలకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథపై కూడా చర్చలు జరుగుతున్నాయి.