ఆంటీ కామెంట్స్‌పై ఇచ్చిప‌డేసిందిగా!

యాంక‌ర్ ట‌ర్న్డ్ ఆర్టిస్ట్ అన‌సూయ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కావ‌డం తెలిసిందే.;

Update: 2026-03-06 04:55 GMT

యాంక‌ర్ ట‌ర్న్డ్ ఆర్టిస్ట్ అన‌సూయ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కావ‌డం తెలిసిందే. సినిమాల‌కు మించి వివాదాస్పద ఆంశాల కార‌ణంగానే గ‌త కొంత కాలంగా నెట్టింట వైర‌ల్ అవుతూ వ‌స్తోంది. తాజాగా మ‌రో సారి సోష‌ల్ మీడియాలో అన‌సూయ వైర‌ల్ అవుతోంది. దీనికి కార‌ణం త‌ను పాల్గొన్న ఓ హోలీ వేడుక‌. దీన్ని ఉద్దేశిస్తూ అన‌సూయ పెట్టిన పోస్ట్‌. వివ‌రాల్లోకి వెళితే.. సామాజిక మాధ్య‌మాల్లో ఏదో ఒక టాపిక్‌పై స్పంద‌స్తూ ట్రోలింగ్‌కు గుర‌వుతున్న అన‌సూయ తాజాగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

త‌ప్పు చేసిన వారిని వ‌దిలేసి దాన్ని ఎదిరించే వారిని టార్గెట్ చేయ‌డం ఏం బాగాలేద‌ని అస‌హ‌నాన్ని వ్యక్తం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ హోలీ వేడుక‌ల్లో అన‌సూయ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌లో మాట్లాడేందుకు ముందుకొచ్చిన అన‌సూయ మైక్ ప‌ట్టుకుని మాట్లాడటం మొద‌లు పెట్టగానే అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా `ఆంటీ ఆంటీ..` అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే కొంత మంది ఈ వీడియోకు వ‌చ్చిన కామెంట్స్‌తో ఓ రీల్ చేశారు.

ఇది అన‌సూయ‌కు అస‌హ‌నాన్ని తెప్పించింది. వెంట‌నే దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. `ఇత‌రుల బాధ‌లో కూడా వినోదం వెతికే వారిని, క‌నీస సానుభూతి, సామాజిక బాధ్య‌త లేని వారిని స‌మాజం నిల‌దీసే రోజు రావాలి. వ‌య‌సును బ‌ట్టి హేళ‌న చేయ‌డం, మ‌హిళ‌ల‌పై వివ‌క్ష చూప‌డం ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాదు. ఇలాంటి వారిని చూసి స‌మాజం సిగ్గుప‌డాలి. అంద‌రూ నాకెందుకులే అని వ‌దిలేస్తూ వెళితే..ఇలాంటివి సాధార‌ణం అవుతాయి. క్ర‌మంగా అంద‌రం మాన‌వ‌త్వం కోల్పోతాం` అంటూ ఇచ్చిప‌డేసింది.

అంతే కాకుండా `నేను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్ప‌డానికి మొహ‌మాట‌ప‌డ‌ను. నేను సాధించిన విజ‌యాలు, నా ప్ర‌యాణం నాకెంతో గ‌ర్వ‌కార‌ణం. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా త‌ట్టుకుని నిల‌బ‌డిన ధైర్య‌మే న‌న్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో ఎదుర్కొని పైకి వ‌చ్చేవారిని విమ‌ర్శించ‌డానికి మీరెవ‌రు? ` అంటూ ట్రోల‌ర్స్‌కి స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది. చాలా రోజుల త‌రువాత అన‌సూయ ఈ రేంజ్‌లో ఇచ్చిప‌డేయ‌డంతో మ‌ళ్లీ నెట్టింట ట్రెండ్ అవుతోంది. గ‌తంలో చాలా సంద‌ర్భాల్లో ప‌లు అంశాల‌పై అన‌సూయ నెట్టింట ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

శివాజీ కామెంట్‌ల‌పై అన‌సూయ కామెంట్స్ చాల పెద్ద కాంట్రవర్సీ నడిచింది . త‌న‌ని డైరెక్ట్‌గా శివాజీ సంబోధించ‌క‌పోయాని కావాల‌ని కౌంట‌ర్ ఇస్తూ నెట్టింట వైర‌ల్ అయ్యే ప్ర‌య‌త్నం చేసింది అని తనని టార్గెట్ చేసారు. ఆ త‌రువాత నుంచి సైలెంట్ అయిన అన‌సూయ మ‌ళ్లీ తాజా వివాదంలో నెట్టింట యాక్టీవ్ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌ళ్లీ ఏమవ్వుతుంది అని చర్చ నడుస్తుంది.అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో పెద్ద‌గా సినిమాలు లేని అన‌సూయ ఇప్పుడు త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తూ అక్క‌డ రెండు సినిమాలు చేస్తోంది. ఫ్లాష్ బ్యాక్‌, వోల్ఫ్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీస్ ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

Tags:    

Similar News