ముక్కుకు ముక్కెరతో గుండె గిల్లుతున్న ఆషిక‌

ఆషిక రంగ‌నాథ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభ‌మే కింగ్ నాగార్జున లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది.;

Update: 2026-03-06 03:32 GMT

ఆషిక రంగ‌నాథ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభ‌మే కింగ్ నాగార్జున లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేసే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఆషిక ఫ్యాష‌న్ కంటెంట్ లోను దూసుకుపోతోంది. సోష‌ల్ మీడియాల్లో గుబులు పుట్టిస్తోంది. ఆషిక తాజా ఇన్ స్టా పోస్ట్ ట్రెండింగ్ గా మారింది.




 


ముక్కుకు ముక్కెరతో గుండె గిల్లుతున్న అందాల భామ ఆషిక రంగనాథ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఈ కన్నడ కస్తూరి తన కొత్త స్టైలింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేస్తోంది. కేవలం ముక్కెర మాత్రమే కాదు.. తను ఎంచుకున్న డిజైనర్ లుక్కుకు తగ్గట్టే చేతిలో ఆ తెల్లని గులాబీని పట్టుకుని కనిపిస్తున్న తీరు అభిమానుల గుండె గిల్లుతోంది. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ మిక్స్ అయిన ఈ లుక్‌లో ఆషిక మెరిసిపోతుంటే ``అందమైన గులాబీ సంథింగ్ అమ్మడూ..` అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.




 


ఈ అద్భుతమైన లుక్ వెనుక పెద్ద టీమ్ కృషి ఉందని ఆషిక పేర్కొంది. `ఫర్ ఏ వెరీ స్పెషల్ ఈవెంట్` అంటూ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన ఈ భామ..ఇంత తక్కువ సమయంలో తన కోసం ఈ కస్టమ్ లెహంగాను సిద్ధం చేసిన శ్రద్ధా పొన్నప్పకు థాంక్స్ చెప్పింది. అలాగే తన నగలు, మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసిన నిపుణులకు పూర్తి క్రెడిట్ ఇచ్చింది. అయితే ఇంతకీ ఆ `వెరీ స్పెషల్ ఈవెంట్` ఏంటి? అన్న వివరాలను మాత్రం ఆషిక సస్పెన్స్‌లో పెట్టింది. ఆ ఈవెంట్ వివరాల కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.




 


తెలుగు సినిమాల ప్రస్థానం:

నందమూరి కళ్యాణ్ రామ్ సరసన `అమిగోస్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషిక.. కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన `నా సామిరంగ` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో `వరాలు`గా తన పల్లెటూరి పడచు పాత్రతో కుర్రకారును కట్టిపడేసింది. ఈ సినిమా తనకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా వరుస అవకాశాలు దక్కేలా చేసింది.




 


కెరీర్ ప‌రంగా బిజీ..

2026 సంవత్సరం ఆషిక రంగనాథ్ కెరీర్‌లో చాలా బిజీగా ఉండబోతోంది. మాస్ మహారాజా రవితేజ సరసన కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర`లో కూడా ఆషిక కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఏప్రిల్ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.




 


డిజిట‌ల్ పైనా దృష్టి..

కేవలం సినిమాలే కాకుండా, ఆషిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలతో వెబ్ సిరీస్‌ల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన కన్నడ హిట్ చిత్రం `గత వైభవమ్` తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మునుముందు మరిన్ని స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీస్‌లలో కూడా ఈ ముక్కెర సుందరి కనిపించనుంది.

Tags:    

Similar News