'జనవరి 12 విడుదల ' ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇదే... అనిల్ రావిపూడి ఖాతాలో 10 వ హిట్ పక్కానా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది దర్శకులు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Update: 2026-09-22 17:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది దర్శకులు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు వరుసగా 12 సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తుంటే అనిల్ రావిపూడి తొమ్మిది విజయాలను తన ఖాతాలో వేసుకొని పదో సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి 'జనవరి 12 విడుదల' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో మరోసారి అనిల్ రావిపూడి కామెడీనే నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎమోషన్స్ ను సైతం బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులందరిని కంటతడి పెట్టేలా డిజైన్ చేశారట. క్లైమాక్స్ అయితే భారీ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కి కూడా పెద్దపీట వేసినట్టుగా తెలుస్తుంది... ఇంటర్వెల్ లో వెంకటేష్ కళ్యాణ్ రామ్ కు మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుందట. దాంతో వాళ్లిద్దరు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఆటోమేటిగ్గా కండ్లల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయనే వార్తలైతే వస్తున్నాయి. ఇక క్లైమాక్స్ సీన్ లో హీరోలిద్దరు కలిసి ఫైట్ చేసినప్పటికి ప్రేక్షకుల్లో తెలియని ఒక గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలను కూడా ఇందులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏదేమైనా కూడా కామెడీతో పాటు ఈసారి ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులను కనెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి చాలా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో తన ఖాతాలో పదో విజయాన్ని వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సంవత్సరం 'మన శంకర్ ప్రసాద్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన వచ్చే ఏడాది 'జనవరి 12 విడుదల' సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు... అనిల్ రావిపూడి పేరు చెబితే చాలు ప్రేక్షకులు ఆటోమేటిగ్గా థియేటర్ కి వచ్చేస్తారు. ముఖ్యంగా అనిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ప్రతిసారి సక్సెస్ లను సాధిస్తుండడం విశేషం...

ఇప్పటికే స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న కూడా ఆయనకున్న కమిట్ మెంట్ల ప్రకారం సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ సైతం 'జన నాయకుడు' సినిమాకి దర్శకుడిగా మొదట అనిల్ రావిపూడి నే అనుకున్నారట. అనిల్ ను పిలిపించుకొని మరి మూవీ చేయమని అడిగారట. కానీ అనిల్ కి ఇతర హీరోలతో ఉన్న కమిట్మెంట్స్ వల్ల నేను ఆ సినిమా చేయలేనని చెప్పాడట. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీ రీమేక్ గా 'జన నాయకుడు' సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.

Tags:    

Similar News