ప్రముఖ పాప్ స్టార్ అరెస్ట్.. మద్యం మత్తులో ఏం చేసిందంటే?
ఈ క్రమంలోనే ఒక ప్రముఖ పాప్ స్టార్ మద్యం మత్తులో చేసిన తప్పు ఆమెను కటకటాల పాలు చేసింది.;
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. మద్యం సేవించి వాహనం నడపకూడదు అని ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ.. కొంతమంది లెక్కచేయకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా పీకల వరకు తాగేసి రోడ్లపై విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. పైగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇతరులపై దాడి చేయడం అమానవీయం. సామాన్యుల సంగతి కాస్త పక్కన పెడితే.. సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ముఖ్యంగా నలుగురికి రోల్ మోడల్ నిలవాల్సింది పోయి వీరు చేసే పనుల వల్ల అటు అభిమానులే కాదు ఇటు సినీ ప్రేక్షకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.. ముఖ్యంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన సెలబ్రిటీలే ఇలా బాధ్యత తప్పి ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ పాప్ స్టార్ మద్యం మత్తులో చేసిన తప్పు ఆమెను కటకటాల పాలు చేసింది.
వివరాలలోకి వెళితే.. ప్రఖ్యాత గ్లోబల్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ బుధవారం రాత్రి దక్షిణ కాలిఫోర్నియాలో మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాలిఫోర్నియాలో బుధవారం మార్చి 4 రాత్రి 9:30 గంటల ప్రాంతంలో బ్రిట్నీ స్పియర్స్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా.. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులు సాధారణ తనిఖీలో భాగంగా స్పియర్స్ ను ఆపి పరీక్షించగా.. ఆమె మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. యూఎస్ చట్ట ప్రకారం తీవ్రమైన నేరం కావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారట. ఇక మే 4వ తేదీన వెంచురా కౌంటీ సుపీరియర్ కోర్టులో ఆమె విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియదు.. ప్రస్తుతం ఆమె ఇలా మద్యం సేవించి వాహనం నడుపుతూ జైలు పాలవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే చట్టపరమైన చిక్కుల్లో స్పియర్స్ పడడం ఇదేమి మొదటిసారి కాదు.. 2007లో లాస్ ఏంజెల్స్ లో పార్కు చేసిన ఒక కారు ఢీ కొట్టి పారిపోయిన ఆమె.. ఆ తర్వాత నాలుగు సార్లు దుష్ప్రవర్తన ఆరోపణలు కూడా ఎదుర్కొంది. వాహన యజమానికి నష్టపరిహారం కూడా చెల్లించింది. అలా నిత్యం ఏదో ఒక విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న ఆమె ఇలా మళ్లీ ఇప్పుడు చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బ్రిట్నీ స్పియర్స్ 1981 డిసెంబర్ 2న మిస్సిస్సిప్పి అమెరికాలో జన్మించింది. పాప్ సింగర్ అయిన ఈమె "ప్రిన్స్ ఆఫ్ పాప్" గా బిరుదును కూడా దక్కించుకుంది. 21వ శతాబ్దపు గొప్ప పాప్ సింగర్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకున్న ఈమె.. చిన్నప్పటి నుండే సంగీతం పై ఆసక్తి పెంచుకొని, 1992లో రూతుల్లెస్ మ్యూజికల్ అండ్ ది ఆల్ న్యూ మిక్కీ మౌస్ క్లబ్ టెలివిజన్ సిరీస్ చివరి రెండు సీజన్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సింగర్ గానే కాకుండా నటిగా, నృత్యకారిణిగా పాటల రచయితగా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.