'సానుభూతి కోసం పిల్లలను ఆర్తి..': రవి మోహన్ 4 పేజీల ప్రెస్ నోట్
తమిళ నటుడు రవి మోహన్ తన భార్యతో ఆర్తితో కొద్ది రోజుల క్రితం విడాకులు సోషల్ మీడియాలో తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.;
తమిళ నటుడు రవి మోహన్ తన భార్యతో ఆర్తితో కొద్ది రోజుల క్రితం విడాకులు సోషల్ మీడియాలో తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే.. తన అనుమతి లేకుండా డివోర్స్ అనౌన్స్ చేశారని ఆర్తి ఆరోపించారు. ఆ తర్వాత కేవలం పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నానని రీసెంట్ గా పోస్ట్ పెట్టారు. ఆర్థికంగా.. నైతికంగా రవి నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని అన్నారు.
ఆర్తి సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఇప్పుడు రవి మోహన్ స్పందించారు. నాలుగు పేజీల ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఆర్తి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. సానుభూతి కోసం పిల్లలను ఆర్తి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ మేరకు రవి మోహన్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"నా వివాహ సంబంధాల నుంచి వ్యక్తిగత లాభం కోసం లేదా సానుభూతిని మార్చుకోవడానికి నేను అనుమతించను. ఇది ఆట కాదు. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అది సత్యాన్ని వెలుగులోకి తెస్తుందని నమ్ముతున్నాను. న్యాయాన్ని గౌరవిస్తున్నాను. నేను ఏళ్ల తరబడి శారీరక, మానసిక, భావోద్వేగ వేధింపుల నుంచి బయట పడ్డాను " అని తెలిపారు.
"నా తల్లిదండ్రులను కలవడానికి కూడా కష్టమైంది. వివాదాలను నయం చేయడానికి, బంధాన్ని కాపాడటానికి చేసిన ప్రతి ప్రయత్నం ఉన్నప్పటికీ భరించలేనిదిగా మారి వాస్తవికతలో చిక్కుకున్నాను, చివరకు జీవించలేని జీవితం నుంచి దూరంగా నడిచే శక్తి నేను కనుగొన్నాను. దూరంగా వెళ్లడం ఎంచుకోవడం తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి బరువైన హృదయంతో ఉన్నాను" అని చెప్పారు.
"నేను స్పష్టంగా చెబుతున్నా. కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పటిలాగే గౌరవంగా, న్యాయంపై నమ్మకంతో నిలబడతాను. నేను ఇంటిని వదిలి వెళ్ళాలని ఎంచుకున్న నిమిషంలోనే "ex" అనే పదం నా హృదయంలో పుట్టింది, నేను చివరి శ్వాస విడిచే వరకు అది అలాగే ఉంటుంది. నా పిల్లలను ఆర్తి సానుభూతి కోసం ఉపయోగించుకుంటున్నట్లు ఉంది. అందుకు బాధగా ఉంది" అంటూ రాసుకొచ్చారు.
అయితే ఆర్తితో విడాకుల ప్రకటన తర్వాత కెనిషాతో రవి మోహన్ రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంపై ఓ సారి స్పందించిన ఆయన, అలాంటిదేమీ లేదని తెలిపారు. కానీ ఎప్పటికప్పుడు కలిసే కనిపిస్తున్నారు. రీసెంట్ గా చెన్నైలో జరిగిన వివాహ వేడుకలోనూ కనిపించారు. ఆ వెంటనే ఆర్తి పోస్ట్ పెట్టగా.. ఇప్పుడు సుదీర్ఘమైన ప్రెస్ నోట్ ను రవి మోహన్ రిలీజ్ చేశారు.