రెండు దశాబ్దాల తర్వాత కంబ్యాక్ అవుతోన్న బ్యూటీ!
బాలీవుడ్ వెటరన్ నటి రవీనా టాండన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.;
బాలీవుడ్ వెటరన్ నటి రవీనా టాండన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ తో పాటు కొన్నాళ్ల పాటు సౌత్ లోనూ బిజీగా కొనసాగింది. ఇప్పటికీ అవకాశాలు వచ్చినప్పుడల్లా సౌత్ లో నటిస్తోంది. అయితే కోలీవుడ్ కి మాత్రం బాగా దూరమైంది. రవీనా టాండన్ కోలీవుడ్లో సినిమాలు చేసి రెండు దశాబ్దాలు దాటింది.
కన్నడ..తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించినా? కోలీవుడ్ లో మాత్రం ఈ రెండు దశాబ్ధాల కాలంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి అవకాశాలు రాక చేయలేదా? ఆసక్తి లేక వదులుందా? అన్నది తెలియదు గానీ తాజాగా మళ్లీ అక్కడా మ్యాకప్ వేసుకుంటుంది. విజయ్ ఆంటోనీ కథానయకుడిగా స్వీయా నిర్మాణంలో 'లాయర్' అనే సినిమాకు సన్నాహాలు జరుతున్నాయి. జాషువా సేతురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
జూన్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమతుంది. ఇందులో ఓ కీలక పాత్రకు రవీనా టాండన్ ఒకే చెప్పింది. ఆ పాత్ర విజయ్ రోల్ కి ధీటుగా ఉంటుందని సమాచారం. 1999లో రవీనా టాండన్ నటించిన 'శూల్' చిత్రంలో ఆమె నటన ఎంతగానే నచ్చిందని... అటుపై తాను దర్శకుడు అయిన తర్వాత ఎప్పటి కైనా ఆమెతో సినిమా చేయాలని ఉండేదని ఇప్పుడా 'కోరిక' లాయర్ రూపంలో తీరుందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు.
కోలీవుడ్ లో రవీనా టాండన్ 1994 లో 'సాదు' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అందులో అర్జున్ కి జంటగా నటించింది. అటుపై 2001లో కమల్ హాసన్ నటించిన `ఆళవందాన్` చిత్రంలో నటించింది. అదే కోలీవుడ్ లో చివరి చిత్రం. ఆ తర్వాత మళ్లీ తమిళ్ వైపు చూడలేదు.