'పెద్ది'లో ఐటమ్ సాంగ్ ఆయనకు సాహసమే!
టైటిల్ తోనే ఇది మాస్ సినిమాగా తేలిపోయింది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేస్తున్నా కంటెంట్ చూస్తుంటే? రీజనల్ గానే ఎక్కువగా హైలైట్ అవుతుంది.;

టాలీవుడ్ స్టార్ హీరోతో ఓ కమర్శియల్ సినిమా అంటే అందులో కచ్చితంగా ఐటం సాంగ్ ఉండాల్సిందే. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేయకపోయినా? తప్పక ఇరికించాల్సిందే. ఎందుకంటే ఇది ఫ్యాన్స్ డిమాండ్. ఎంతో కాలంగా వస్తోన్న తెలుగు సినిమా అనవాయితీ కూడా. అందులోనూ రామ్ చరణ్ లాంటి స్టార్ తో తప్పనిసరిగా ఐటం పాట ఉండాల్సిందే. ప్రస్తుతం చరణ్ తో బుచ్చిబాబు `పెద్ది` అనే చిత్రాన్ని తెర కెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
టైటిల్ తోనే ఇది మాస్ సినిమాగా తేలిపోయింది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేస్తున్నా కంటెంట్ చూస్తుంటే? రీజనల్ గానే ఎక్కువగా హైలైట్ అవుతుంది. చరణ్ ఇమేజ్ ని బేస్ చేసుకుని రాసిన కథలా ఉంది. ఇలాంటి సినిమాలో తప్పక ఐటం సాంగ్ ఉండాల్సిందే. మరి బుచ్చిబాబు ఆ ఛాన్స్ తీసుకుం టున్నాడా? లేదా? అన్నది చూడాలి. అయితే ఐటం పాట ఉంటే గనుక రెహమాన్ కు ఇది పెద్ద సవాల్ అవుతుంది.
సంగీతం లో రెహమాన్ ఓ బ్రాండ్. అద్భుతమైన పాటలు...గొప్ప ఆర్ ఆర్ ఇస్తారు. ఆ పరంగా చూడాల్సిన పనిలేదు. అందుకే ఏరికోరి మరీ బుచ్చిబాబు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి మరీ రంగంలోకి దించారు. కానీ రెహమాన్ ఐటం సాంగ్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. రెహమాన్ ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చారు.
మరెన్నో రొమాంటిక్ బాణీలు సమకూర్చారు. సంగీతంతో ప్రపంచాన్నే మైమరిపించారు. మరి అలాంటి లెజెండ్ తెలుగు సినిమాకు ఐటం సాంగ్ ఇస్తే ఎలా ఉంటుంది? అన్నదే చర్చగా మారింది. ఎందుకంటే ఐటం పాటలంటే థమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి వారిక్కడ మాస్టర్స్ లా మారిపోయారు. వాళ్లను తల దన్నేలా రెహమాన్ ఐటం సాంగ్ ఇవ్వగలరా? అన్నది చూడాలి.