కొడుకు మూవీని స్టార్ హీరో ప్రమోట్ చేస్తారా?
విజయ్ తనకు ఫ్యాన్స్ ను, లవ్ ను ఫుల్ గా ఇచ్చారని జేసన్ సంజయ్ చెప్పారు. 'మా నాన్న ఫ్యాన్స్ ను ఇచ్చారు. లవ్ ను ఇచ్చారు.
తండ్రి ఓ స్టార్ హీరో.. కొడుకు మాత్రం ఆయనలా కాకుండా దర్శకుడిగా తన జర్నీని మొదలుపెట్టాడు. తండ్రి సంపాదించిన ఫ్యాన్ బేస్ తనకు ఫస్ట్ స్ట్రెంత్ అని చెబుతూనే.. తనకంటూ మాత్రం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అదే ఇప్పుడు విజయ్- జేసన్ సంజయ్ తండ్రీకొడుకుల రిలేషన్ లో ఇంట్రెస్టింగ్ విషయం. జేసన్ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా సిగ్మా విషయంలో కూడా ఆ కనెక్షన్ కనిపిస్తోంది.
విజయ్ తనకు ఫ్యాన్స్ ను, లవ్ ను ఫుల్ గా ఇచ్చారని జేసన్ సంజయ్ చెప్పారు. 'మా నాన్న ఫ్యాన్స్ ను ఇచ్చారు. లవ్ ను ఇచ్చారు. ఆయన కూడా తన సిగ్మా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు' అని తెలిపారు. ఆ కామెంట్స్ లో తన తండ్రి పట్ల జేసన్ కు ఉన్న రిలేషన్ కనిపిస్తోంది. తన సినిమా కోసం విజయ్ కూడా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని జేసన్ ఇప్పుడు ప్రమోషన్స్ లో చెప్పడం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
అదే సమయంలో ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సీఎంగా ఆయనకు ఎన్నో పనులు ఉన్నాయి. అందుకే సిగ్మా సినిమా ప్రమోషన్స్ కు తన తండ్రి రారని జేసన్ సంజయ్ క్లారిటీ ఇచ్చారు. అంటే కొడుకు సినిమాపై ఆసక్తి ఉన్నా.. తన రాజకీయ బాధ్యతల కారణంగా విజయ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.
ఇక జేసన్ సంజయ్ కెరీర్ ప్లాన్ కూడా తండ్రికి పూర్తి భిన్నమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే విజయ్ స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. కానీ జేసన్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. స్క్రీన్ పై కనిపించడం కంటే.. స్క్రీన్ వెనుక ఉండి కథను నడిపించడమే తనకు ఇష్టమని ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్నారు.
అందుకోసం జేసన్ ముందుగానే ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సిగ్మాతో దర్శకుడిగా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ ఎలిమెంట్స్ తో మూవీ గ్రాండ్ గా తెరకెక్కుతోంది.
సంపత్ రాజ్, రాజు సుందరం, శివ్ పండిట్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. అయితే సిగ్మా మూవీ జేసన్ కు కేవలం తొలి సినిమా మాత్రమే కాదు. తండ్రి విజయ్ ఇచ్చిన ప్రేమ, అభిమానాన్ని వెంట తీసుకుని.. తన సొంత గుర్తింపు కోసం కొడుకు వేస్తున్న తొలి బిగ్ స్టెప్. మరి జేసన్ సంజయ్ ఫస్ట్ స్టెప్ తో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో వేచి చూడాలి.