శ‌ర్మా సిస్ట‌ర్.. ఎంత ఆర‌బోసినా ఎందుకో ఈ వృధా ప్ర‌యాస‌!

ఈ పోస్ట్‌లో మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోగా.. అభిమానులు.. ఫాలోవర్లు ఐషా శ‌ర్మ‌ అందాన్ని, వేకేషన్ లుక్‌ను పొగుడుతూ హార్ట్ ఎమోజీలు, ఫైర్ సింబల్స్‌తో పెద్ద ఎత్తున స్పందించారు.

Update: 2026-09-17 02:44 GMT

రెగ్యులర్‌గా గ్లామరస్ ఫోటోషూట్లతో చెలరేగిపోవడం నటి ఐషా శర్మ స్టైల్. శర్మ సిస్టర్స్ ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరీ ఫోటోల కోసం పోటీపడుతుంటారు. తాజాగా బాలిలోని కాంగు నుండి ఐషా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్‌లో మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోగా.. అభిమానులు.. ఫాలోవర్లు ఐషా శ‌ర్మ‌ అందాన్ని, వేకేషన్ లుక్‌ను పొగుడుతూ హార్ట్ ఎమోజీలు, ఫైర్ సింబల్స్‌తో పెద్ద ఎత్తున స్పందించారు. ట్యాగ్ చేసిన‌ బ్రాండ్ దుస్తులపై కూడా పలువురు ప్రశంసలు కురిపించారు.

 

ఈ కామెంట్లు - రిప్లైలలో కొందరు యూజర్ల నుంచి విచిత్రమైన స్పందనలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొద్దిమంది యూజర్లు పలువురి కామెంట్ల కింద `నేను అందంగా లేనా?`, `నేను హాట్ కాదా?` అని పదే పదే రిప్లైలు ఇవ్వగా.. మరికొందరు ప్రతిచోటా తామర పువ్వు ఎమోజీలను పోస్ట్ చేస్తూ కనిపించారు. ఇది పోస్ట్ అసలు విషయంతో సంబంధం లేకుండా కామెంట్ సెక్షన్‌లో ఒక రకమైన స్పామ్ సంస్కృతిని ఎలివేట్ చేసింది.

 

సాధారణ ప్రశంసలకు మించి... ఈ కామెంట్ సెక్షన్‌లో రకరకాల వ్యక్తిగత సంబంధం లేని ఆరాధన ధోరణులు కనిపిస్తున్నాయి. కొందరు ఐషా ఫిట్‌నెస్, గ్లోయింగ్ ఫేస్, బాలి వాతావరణాన్ని అభినందిస్తుంటే.. మరికొందరు చాలా బోల్డ్‌గా అభ్యంతరకరమైన రీతిలో కామెంట్లు చేశారు. సెలబ్రిటీల సోషల్ మీడియా ప్రొఫైళ్లలో నిజమైన అభిమానంతో పాటు అనుచిత వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ప్రూవైంది.

 

మొత్తంగా సోషల్ మీడియాలో జ‌నం దృష్టిని ఆకర్షించే తీరు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. పబ్లిక్ ఫిగర్లు షేర్ చేసే లైఫ్‌స్టైల్ - ట్రావెల్ కంటెంట్‌కు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఫ్యాన్స్, స్పామర్లు రకరకాల అభినందనల ద్వారా విపరీతమైన ఎంగేజ్‌మెంట్ ఎలా వస్తుందో ఈ ట్రెండ్ స్ప‌ష్ఠం చేసింది.

ఇదిలా ఉంటే.. సౌత్ సినిమాలపై ఐషా శర్మ గ‌తంలో చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో మరో చర్చకు దారితీశాయి. సౌత్ సినిమాలలో నటించే అవకాశంపై ఈ బ్యూటీ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాల‌లో అలాగే రెడిట్ వేదికగా చ‌ర్చ‌గా మారింది. అసలు ఆమెను ఎవరు సినిమాల్లోకి తీసుకుంటారని కొందరు ఎదురు ప్రశ్నించగా.. క‌నీసం నార్త్ ఇండస్ట్రీలోనే సరిగ్గా అవకాశాలు లేని సమయంలో సౌత్ సినిమాలకు నో చెప్పడం ఏంటని మరికొందరు పెదవి విరిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలను కలగలిపి మాట్లాడటం సరికాదని కొందరు తప్పుపట్టగా.. ఇది కేవలం సరదాగా చేసిన జోక్ అయి ఉండొచ్చని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News