Bigg Boss Telugu 10: టెంపర్ చూపిస్తున్న ఆవేశం స్టార్ వంశీ
రోహిత్, టెంపర్ వంశీల మధ్య జరిగిన రచ్చ బిగ్‌బాస్ చరిత్రలోనే నిలిచిపోయే హై-వోల్టేజ్ గొడవల్లో ఒకటిగా మారుతుంది అనుకోవడం లో అతిశయోక్తి లేదు.
బిగ్బాస్ చూసే చాలా మంది ప్రేక్షకులకి షో లో కంటెస్టెంట్లు ఎప్పుడెప్పుడు గొడవలు పడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక గొడవ ఈ సీజన్ లో చాలా అర్లీ గా జరిగింది అని చెప్పుకోవచ్చు. రెండో వారం లో ఎప్పుడూ లేనటువంటి విధంగా, టెంపర్ వంశీ తన అగ్రెషన్ ని టెంపర్ ని చూపిస్తూ రోహిత్ మీదకి వెళ్ళాడు. రోహిత్ ని రెచ్చగొట్టడం తో అతను కూడా రెచ్చిపోయి గొడవకి దిగారు. ఒకానొక దశ లో ఇద్దరూ మీద పడి కొట్టుకుంటారేమో అని కూడా అనిపించింది.
రోహిత్, టెంపర్ వంశీల మధ్య జరిగిన రచ్చ బిగ్‌బాస్ చరిత్రలోనే నిలిచిపోయే హై-వోల్టేజ్ గొడవల్లో ఒకటిగా మారుతుంది అనుకోవడం లో అతిశయోక్తి లేదు. తన పేరుకు తగ్గట్టే వంశీ 'టెంపర్' చూపిస్తున్నప్పటికీ, అది ప్రదర్శిస్తున్న సమయం, సందర్భమే పూర్తిగా తప్పు దారి పడుతున్నాయి.
స్క్రీన్ స్పేస్ కొట్టేయాలనే ఆరాటంలో లేనిపోని కృత్రిమ ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు. సంబంధం లేని విషయాల్లో తల దూర్చడం, ఎదుటివారిని అనవసరంగా రెచ్చగొట్టడం, అవసరం లేని దగ్గర వాయిస్ రైజ్ చెయ్యడం, సంబంధం లేని వ్యక్తుల మీద అరవడం తాజా ఎపిసోడ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది.
మొదట కిచెన్లో ముకేశ్ మీద కోపాన్ని, ఏ తప్పూ లేని వర్షిణిపై ఊరికే కేకలు వేసి నానా హంగామా చేశాడు. పాపం ఎందుకు అరుస్తున్నాడో కూడా వర్షిణి కి కానీ ఇతర హౌజ్మేట్స్ కి కానీ అర్థం కాలేదు. మరోవైపు కెప్టెన్సీ వంశీ పని గట్టుకుని రోహిత్‌పై ద్వేషాన్ని పెంచుకుంటున్న తీరు ఆశ్చర్యం వేస్తుంది. రోహిత్ చాలా మర్యాదగా హుందాగా మాట్లాడినప్పటికీ, వంశీ అనవసరంగా టెంపర్ ప్రదర్శిస్తూ వీక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాడు.
మొదటి వరం లో ఒక్క సందర్భం లో కూడా వంశీ కోపం చూపించలేదు. కుదిరినంత వరకు ఓపిగ్గా ఉండి, సడన్ గా వాయిస్ రైజ్ చేస్తున్నాడు. అలా చేస్తేనే స్క్రీన్ టైం వస్తుందనో, లేదా మిగిలిన వాళ్ళ దృష్టి లో పడొచ్చు అనో తెలీదు కానీ చాలా బ్యాడ్ గేమ్ ఆడుతున్నాడు.
ఇదే దూకుడును ఇలాగే అడ్డదిడ్డంగా కొనసాగిస్తే, ఈ వారాంతం నాగార్జున దగ్గర గట్టిగానే తిట్లు తినాల్సి వస్తుంది.