'ప్యారడైజ్' కథలో కీలక మార్పు చేసింది అతనేనా..? నాని కి వెన్ను పోటు పొడిచేది ఎవరు...
అలాగే నానిని వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
నాని అత్యంత ప్రెస్టేజీయస్ గా తీసుకుని చేస్తున్న 'ప్యారడైజ్' సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించారు. ఈ సినిమా కథలో హీరో నాని కొన్ని కీలకమైన మార్పులైతే చేశారట. ఇక సంపూర్ణేష్ బాబు ఈ మూవీ లో 'బిరియాని' అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండాలని నాని సూచించినట్టుగా తెలుస్తుంది.
అలాగే నానిని వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ఈ సినిమాలో తను చాలా సీరియస్ క్యారెక్టర్ ని పోషించానని చెప్పాడు. అలాగే ఇప్పటివరకు తను చేసిన కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకున్నారని, కానీ ఇప్పుడు ఈ మూవీలో చేసిన సీరియస్ పాత్రలో సైతం తను 100% ఎఫర్ట్ పెట్టి నటించానని అదికూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేశాడు. మొత్తానికైతే సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నప్పటికి సంపూ మాత్రం నాని పక్కనే ఉంటూ అతన్ని వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికైతే సంపూ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయగలిగే కెపాసిటి ఈ సినిమాకి ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 24వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే...
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన వస్తుంది. కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఆ రేంజ్ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉంటే పర్లేదు లేకపోతే మాత్రం అటు దర్శకుడికి, ఇటు హీరోకి పూర్తిగా బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదమైతే ఉంది. కానీ శ్రీకాంత్ ఓదెల మాత్రం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కథని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. మేకింగ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలైతే తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఇంట్రడక్షన్ ఫైట్ ఈ సినిమాకి చాలా హైలెట్ గా నిలవబోతుందట. అలాగే క్లైమాక్స్ లో మోహన్ బాబుతో చేసే ఫైట్ కూడా ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం...ఈ మూవీతో నాని, శ్రీకాంత్ ఓదెల కెరియర్లు మారబోతున్నాయంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి...