'ది ప్యారడైజ్' సక్సెస్ అయితే వీళ్ళ భవిష్యత్ మారుతుందా...

ఈ సినిమా సక్సెస్ అయితే అటు నానికి, హీరోయిన్ కయద్ లోహర్ కి, సంపూర్ణేష్ బాబు ముగ్గురికి చాలా మంచి గుర్తింపైతే వస్తుందని నమ్ముతున్నారు.

Update: 2026-09-17 03:46 GMT

సినిమా ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. ఎవరైతే హిట్ కొడతారో వాళ్ళను ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. వాళ్లకు చాలా అవకాశాలు వస్తాయి, ఎక్కడ చూసినా వాళ్ల పేరే వినిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ బ్లాంక్ చెక్ లు ఇవ్వడానికి సిద్ధమవుతుంటారు. ఎవరైతే ప్లాప్ లతో పూర్తిగా డీలాపడిపోతారో వాళ్ల గురించి పట్టించుకునే నాధుడు ఉండడు. వాళ్ళు ఫోన్లు చేసిన మాట్లాడే వారు ఉండరు. అందుకే ఇండస్ట్రీ లో ఎప్పటికప్పుడు కొత్త పంథాలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలి. అలాంటి వారిని మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలను రెకెత్తిస్తూ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమా మీద ప్రతి ఒక్కరికి భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనే విషయం పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలను బట్టి చూస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిన కూడా ప్రేక్షకుల యొక్క అంచనాలను అందుకోలేదేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి...అంటే ఈ మూవీ మీద ఓవర్ హైప్ ఉందని చెప్పచ్చు. నిజానికి భారీ బజ్ తో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఈ సినిమా ఏ కోవకు చెందుతుంది. ప్రేక్షకుడి అంచనాలను మించి ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు దర్శకుడు చేసిన 'దసర' సినిమా మంచి విజయాన్ని సాధించినా కూడా కమర్షియల్ గా ఈ సినిమాకి పెద్దగా లాభాలైతే రాలేదు. కాబట్టి ప్యారడైజ్ సినిమా విషయంలో డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాలో నాని హీరోగా చేస్తుంటే, కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. సంపూర్ణేష్ బాబు బిరియానీ అనే ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే అటు నానికి, హీరోయిన్ కయద్ లోహర్ కి, సంపూర్ణేష్ బాబు ముగ్గురికి చాలా మంచి గుర్తింపైతే వస్తుందని నమ్ముతున్నారు. ఇక ముఖ్యంగా మోహన్ బాబు సైతం సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి విలన్ గా వైవిధ్య భరితమైన పాత్రల్లో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా 'శ్రీనివాస మంగాపురం' సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

కాబట్టి మోహన్ బాబు పాత్రకి పెద్దగా గుర్తింపైతే రాలేదు. దాంతో మోహన్ బాబు సైతం ప్యారడైజ్ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన వేసిన 'మాలిక్' అనే పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని తన ఎంటైర్ కెరీర్ లో ఆయన పోషించిన విలన్ పాత్రలన్నింటిలో ఇది చాలా సపరేట్ గా నిలుస్తుందంటూ ఆయన గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే మనం ఈ సినిమాలో మోహన్ బాబు ను చాలా కొత్తగా చూడబోతున్నాం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయనకి మరిన్ని విలన్ పాత్రలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో మోహన్ బాబు సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను ముందుకు తీసుకెళ్లినవాడు అవుతాడు. లేకపోతే మాత్రం ఆయన కూడా చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. మొత్తానికైతే ఈ సినిమా హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్, హీరోయిన్ కయదు లోహర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపూర్ణేష్ బాబు, విలన్ మోహన్ బాబు ల కెరియర్లను మార్చే సినిమా అవుతుందా...సక్సెస్ ఫుల్ టాక్ వస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరి భవిష్యత్ మారిపోతుంది. ఒకవేళ తేడా కొడితే మాత్రం వీళ్ళందరి సినీ కెరియర్లకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది...

Tags:    

Similar News