మమిత మరో రష్మిక కానుందా?
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. భారీ వసూలతో ఊహించని క్రేజ్ ఆకాశాన్నంటింది.
ఆవగింజంత అదృష్టం తో పాటు సరైన కథ లేదా పాత్ర పడింది అంటే ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీస్ అయిపోవచ్చని ఎంతోమంది సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు.. అయితే అలా స్టార్ స్టేటస్ లభించిన తర్వాత కొంతమందికి అనూహ్యంగా ఫ్లాపులు పడితే.. మరి కొంతమంది ఆచితూచి అడుగులు వేస్తూ సరైన పాత్రను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న గత మూడు నాలుగు సంవత్సరాలుగా వరుస చిత్రాలతో.. అద్భుతమైన కథా ఎంపికలతో బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ .
స్మార్ట్ ఎంపిక.. బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర.. ఆమె ఎంచుకోవడమే ఆమె కెరియర్ కు ప్లస్ గా నిలిచింది. ఇందులో డీ గ్లామరస్ గా నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి.. ఆ తర్వాత వరుసగా పుష్ప 2, యానిమల్, ఛావా, సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్ ఇలా ప్రతి చిత్రంతో కూడా కరెక్ట్ గా పాత్రలను ఎంచుకుంటూ.. పాత్రలకు ప్రాణం పోస్తూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ముఖ్యంగా ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రతో అందరిని ఆకట్టుకున్న ఈమె కథల ఎంపిక విషయంలో స్మార్ట్ అని నిరూపించుకుంది. ఆ స్మార్ట్ నేస్ ఈమెను బాక్సాఫీస్ వద్ద క్వీన్ గా నిలబెట్టింది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీ మైసాలో కూడా భిన్నమైన పాత్ర పోషిస్తోంది.
రష్మిక బాటలో మమిత బైజు..
రష్మిక తర్వాత ఈ రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్న హీరోయిన్ మరొకరు లేరు అనుకునే సమయం లో సడన్గా వచ్చి పడింది మమిత బైజు.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అల్లరి మాటలతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంటోంది ఈ చిన్నది. రష్మిక బాటలోనే నడుస్తూ.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తూ కోట్లు కొల్లగొడుతూ రికార్డు సృష్టిస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. భారీ వసూలతో ఊహించని క్రేజ్ ఆకాశాన్నంటింది.
నెలలోనే హ్యాట్రిక్ కొట్టిన బ్యూటీ..
అలా తమిళ హీరో ధనుష్ కథానాయకుడిగా విగ్నేష్ రాజా దర్శకత్వంలో ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన 'కర' చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. అలాగే ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది . ఇక అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి చివరి సినిమాగా వచ్చిన జననాయగన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు వసూలు రాబట్టింది. రీసెంట్ గా వచ్చిన బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ చిత్రం కూడా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది . ఇక రీసెంట్ గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా ఏకంగా 260 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది.
అలా కేవలం నెలలోనే మూడు చిత్రాలతో 200 కోట్ల కలెక్షన్లు రాబట్టి హ్యాట్రిక్ కొట్టిన తొలి హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది . ఇలా మొత్తానికి అయితే మంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటూ మరో రష్మిక అనిపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.