రణబాలికి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా?

మరోవైపు రణబాలి విషయంలో విజయ్ దేవరకొండ టార్గెట్ కూడా కాస్త విస్తరించినట్టు కనిపిస్తోంది. విజయ్‌కు ఇప్పటికే యూత్‌లో బలమైన క్రేజ్ ఉంది.

Update: 2026-09-17 13:30 GMT

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న రణబాలి కోసం ప్రస్తుతం అందరి చూపు అక్టోబర్ 16వ తేదీపైనే ఉంది. ఇప్పటివరకు షూటింగ్ ఆలస్యం, రిలీజ్‌పై డౌట్స్ అంటూ వినిపించిన ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్ర బృందం కీలకమైన షూటింగ్‌ను పూర్తి చేసింది. డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ షూటింగ్ పూర్తైంద‌ని అనౌన్స్ చేయ‌డంతో ఇప్పుడు రణబాలి ప్రయాణం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. అయితే ఇక్కడితో పనంతా పూర్తయినట్టు కాదు. అసలు పరీక్ష ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ముందుంది.

పీరియాడిక్ యాక్షన్ సినిమాలకు షూటింగ్ పూర్తవడం కంటే ఆ తర్వాతి వర్క్ మరింత కీలకం. ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్, కలర్ గ్రేడింగ్ వంటి విభాగాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పూర్తవ్వాలి. ముఖ్యంగా రణబాలి కథ ప్రీ- ఇండిపెండెన్స్ కాలానికి సంబంధించినది కావడంతో అప్పటి ప్రపంచాన్ని తెరపై నమ్మదగిన రీతిలో చూపించడంలో వీఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్, కలర్ టోన్ కీలకంగా మారనున్నాయి. అదే సమయంలో మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా యాక్షన్ ఇంపాక్ట్‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే థియేటర్లలో ఆడియ‌న్స్ చూడబోయే ఫైనల్ ఎక్స్‌పీరియన్స్‌ను డిసైడ్ చేసేది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశే.

మరోవైపు రణబాలి విషయంలో విజయ్ దేవరకొండ టార్గెట్ కూడా కాస్త విస్తరించినట్టు కనిపిస్తోంది. విజయ్‌కు ఇప్పటికే యూత్‌లో బలమైన క్రేజ్ ఉంది. అయితే పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్, పాన్ ఇండియా రిలీజ్ వంటి అంశాలు అతన్ని మరింత విస్తృతమైన ఆడియెన్స్‌కు తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియ‌న్స్ తో పాటు ఇతర భాషల ఆడియెన్స్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకోవడానికి ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నంగా మారొచ్చు.

అందుకే రణబాలి విషయంలో ఇప్పుడు ప్రశ్న షూటింగ్ పూర్తైందా లేదా అనేది కాదు. షూట్‌లో రూపొందించిన ఆ భారీ ప్రపంచాన్ని పోస్ట్ ప్రొడక్షన్ ద్వారా ఎంత స్ట్రాంగ్ గా తెరపైకి తీసుకొస్తారు? అదే సమయంలో విజయ్‌కు ఇప్పటికే ఉన్న యూత్ క్రేజ్‌ను దాటి కొత్త ఆడియెన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటారు? అనేదే అసలు ఆసక్తికరమైన అంశంగా మారింది. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చే వరకు ఈ రెండు అంశాలపైనే రణబాలి ప్రయాణం ఆధారపడి ఉండనుంది.

Tags:    

Similar News