సూపర్ స్టార్ లో విలనిజాన్ని మళ్లీ టచ్ చేసేదేవరు?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి నాయకుడిగానే చిత్ర పరిశ్రమకు నటుడిగానే పరిచమయ్యారు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి నాయకుడిగానే చిత్ర పరిశ్రమకు నటుడిగానే పరిచమయ్యారు. విలన్ గా తనదంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విలన్ గా ఆ నాటి రోజుల్లోనే ఓ వెలుగు వెలిగారు. అలా మొదలైన రజనీ ప్రస్థానం నేడు సూపర్ స్టార్ గా ఖ్యాతికెక్కారు. హీరోగా కొత్త ప్రయా ణం మొదలైన క్రమంలో మళ్లీ రజనీకాంత్ విలన్ పాత్రలవైపు చూసింది లేదు. హీరోగా నేడు ఆయన క్రేజ్ విశ్వ వ్యాప్తమైంది. దేశ, విదేశాలే ఆయన సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ రకమైన ఇమేజ్ రజనీలో విలన్ అనే ఆలోచన లేకుండా చేసింది.
అవే పాత్రలు ఇంకెంత కాలం:
ఐదు దశాబ్దాల కెరీర్ లో ఏనాడు రజనీ నోట మళ్లీ విలన్ అనే మాట రాలేదు. అయితే తొలిసారి సైమన్ పాత్ర గురించి లోకేష్ కనగరాజ్ నేరెట్ చేయగానే మనసు ఒక్కసారి విలన్ పాత్రల వైపు మళ్లింది అన్నది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు. సైమన్ పాత్రలో తానే నటిస్తే బాగుండేదని మీడియా ముఖంగా అభిప్రాయ పడ్డారు. హీరో పాత్రలు పోషించి తాను కూడా బోర్ ఫీల్ అవుతున్నానే భావనను వ్యక్తం చేసారు. అదే గెటప్ ..అదే రోల్ ఇంకెంత కాలం ఇలా? కొత్తగా చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన రజనీ మనసులో మళ్లీ మొదలైంది.
జెలస్ ఫీలవుతోన్న నటుడు:
కథానాయకుడు పాత్రదేముంది? అంతా పాజిటివ్ గా ఉంటుంది? ప్రతి నాయకుడి పాత్ర అయితే అంతకు మించి చూపిస్తానంటూ రజనీ బాహాటంగానే ప్రకటించారు. అందుకు సైమన్ పాత్ర ఆజ్యం పోసింది. తాను ఆ పాత్ర పోషించనప్పటికీ ఆ పాత్రలో నటిస్తోన్న నాగార్జునను చూసి ఎంతో జెలస్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ జెలస్ నుంచి రజనీ ఇప్పటి కిప్పుడు బయట పెడే ఛాన్స్ ఎవరు తీసుకుంటారు? అన్నది ఇంట్రెస్టింగ్. రజనీ లాంటి అగ్ర స్థాయి నటుడిని ప్రతి నాయకుడిగా చూపిండమంటే? సామాన్య విషయం కాదు.
అందరికీ సాధ్యమేనా:
ఏ డైరెక్టర్ కి అయినా అతి పెద్ద సవాల్. సైమన్ పాత్ర అన్నది యాదృశ్చికంగా కనెక్ట్ అయింది. లోకేష్ వరల్డ్ నుంచి క్రియేట్ అయిన రోల్ అది. మళ్లీ అలాంటి పాత్ర రాయాలంటే? లోకేష్ కే సాధ్యమా? అంటే ప్రస్తుతానికి అతన్నే స్మరించాలి. ఇండియన్ గ్రైట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ రజనీని విలన్ పాత్రతో మెప్పించడం అన్నది అందరికీ సాధ్యమవుతుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.కొన్ని పాత్రలు అనుకోకుండా ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు అవకాశం వదులుకున్న వారిదే తప్పు అవుతుంది.
మళ్లీ అలాంటి పాత్ర తారస పడాలంటే ఎంత సమయం పడుతుంది? అన్నది చెప్పలేం. కాలక్రమంలో జరగాల్సిందే. మరి ఆ ఛాన్స్ ఏ డైరెక్టర్ కి వరిస్తుంది? రజనీకాంత్ ని విలన్ గా చూపించే ఆసక్తి నెటి తరం డైరెక్టర్లలో ఎంత మందికి ఉంది? ఎవరు ఆ తరహా ప్రయత్నాల్లో ఉన్నారు? అన్నది వెయిట అట్ వాచ్.