బన్నీపై ఆరోపణలు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ‘పుష్ప’ నటుడు!
బన్నీ సెట్స్ లో ఎలా ఉంటారో వివరిస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. సాధారణంగా బ్రేక్ టైమ్‌లో ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ బేసిన్లలో పెట్టి స్నాక్స్ తీసుకొస్తుంటారు.;
సోషల్ మీడియాలో ఈ మధ్య సెలబ్రిటీల గురించి వచ్చే గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఒక పాడ్‌కాస్ట్ వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్, సెట్స్ లో మెయింటైన్ చేసే ప్రోటోకాల్స్ మీద వచ్చిన ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. బన్నీని కలవాలంటే 42 రకాల రూల్స్ ఉంటాయని, కనీసం కళ్లలోకి కూడా చూడకూడదని నార్త్ మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడమే కాకుండా అల్లు ఫ్యాన్స్ లో తీవ్ర అసహనాన్ని నింపాయి. అయితే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ బయటపడింది.
అసలు వివరణ ఏంటంటే.. పుష్ప సినిమాలో బన్నీతో కలిసి నటించిన నటుడు రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పాన్ ఇండియా స్టార్ గురించి ఏ ఆధారం లేకుండా ఇలాంటి బేస్‌లెస్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. పుష్ప 1, పుష్ప 2 సినిమాల కోసం గత నాలుగేళ్లుగా బన్నీతో చాలా క్లోజ్ గా వర్క్ చేసిన అనుభవం తనకు ఉందని, ఆయన గురించి తనకు బాగా తెలుసని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.
బన్నీ సెట్స్ లో ఎలా ఉంటారో వివరిస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. సాధారణంగా బ్రేక్ టైమ్‌లో ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ బేసిన్లలో పెట్టి స్నాక్స్ తీసుకొస్తుంటారు. తనలాంటి ఆర్టిస్టులకు అసిస్టెంట్లు ఉన్నా సరే, అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి బేషజాలు లేకుండా అదే బేసిన్ లో నుంచి స్నాక్స్ తీసుకుని తింటారని రాజశేఖర్ వెల్లడించారు. అంత గ్రౌండ్ టు ఎర్త్ ఉండే వ్యక్తి, మనుషులను దూరం పెట్టి 42 రూల్స్ తో లిస్ట్ ఇస్తారంటే నమ్మశక్యంగా లేదని ఆయన కొట్టిపారేశారు.
బన్నీపై వచ్చిన ఆరోపణలు కేవలం పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపిస్తున్నాయని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. తన ఐడెంటిటీ కోసం, పేరు తెచ్చుకోవడం కోసం ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రతి రోజూ ఉదయాన్నే సెట్స్ లోకి రాగానే ప్రతి ఒక్క టెక్నీషియన్ ని, ఆర్టిస్ట్ ని విష్ చేయడం బన్నీ అలవాటని.. ఒకవేళ పొరపాటున ఎవరినైనా విష్ చేయడం మర్చిపోతే సారీ అని కూడా చెబుతారని ఆయన గుర్తు చేశారు.
అల్లు అర్జున్ ఒక హీరో కంటే ముందు చాలా మంచి మనసున్న వ్యక్తి అని, మనుషులకు ఇచ్చే గౌరవం ఆయనకు బాగా తెలుసని రాజశేఖర్ ఈ వీడియో ద్వారా లోకానికి చెప్పారు. కళ్లలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనేవి కేవలం అటెన్షన్ కోసం సృష్టించిన చీప్ ట్రిక్స్ మాత్రమేనని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ టీమ్ కూడా ఈ విషయంలో లీగల్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక బన్నీతో కలిసి పనిచేసిన వారే స్వయంగా వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఒక క్లారిటీ వచ్చినట్లు ఉందని మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు కానీ, నిజం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుందని కూడా కౌంటర్ ఇస్తున్నారు.