ఈ సర్దార్ ముందు మరింత పెద్ద సమస్య..!
తాజాగా సర్దార్ 2 చిత్ర సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన సినిమా ఫైనల్ ఔట్‌పుట్ పై చాలా సంతృప్తిని వ్యక్తం చేశాడు.
కార్తి హీరోగా 'సర్దార్' వచ్చి సరిగ్గా నాలుగు ఏళ్లు కావస్తుంది. అప్పటి నుంచి ఆయన అభిమానులతో పాటు, తమిళ సినీ ప్రేమికులు 'సర్దార్' సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు కార్తీ ఫ్యాన్స్‌తో పాటు అందరి ఎదురు చూపులకు తెర పడే సమయం వచ్చింది. పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన 'సర్దార్ 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సర్దార్ పార్ట్ 1 సినిమాతో పోల్చితే సర్దార్ పార్ట్ 2 పై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగాయి. అందుకు కారణం సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించడంతో పాటు, స్టార్ కాస్ట్ భారీగా ఉండటం వల్ల అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి పెరుగుతూ పోయాయి. విడుదల సమయం కు తమిళనాటతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా గురించి ప్రముఖంగా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే సర్దార్ 2 అంతకు మించి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సర్దార్ పార్ట్ 1 సూపర్ హిట్..
సర్దార్ పార్ట్ 1లో నీటి సమస్య గురించి ప్రస్థావించడం జరిగింది. ఆ సమస్యను బేస్ చేసుకుని దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన తీరుకు అంత ఫిదా అయ్యారు. ఆ సినిమాలోని కార్తీ రెండు లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ సినిమాలోనూ రెండు లుక్స్ ను కంటిన్యూ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూస్తూ ఉంటే బడ్జెట్ భారీ తనం క్లీయర్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా కార్తికి ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఎస్ జే సూర్య నటించడం జరిగింది. ఆయన విలన్‌గా నటిస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఈ సినిమాతో సూర్య మరోసారి హిట్‌ను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సర్దార్ 2 ఇప్పటికే పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడంతో మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కార్తి సర్దార్ 2 సినిమా రిలీజ్...
తాజాగా సర్దార్ 2 చిత్ర సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన సినిమా ఫైనల్ ఔట్‌పుట్ పై చాలా సంతృప్తిని వ్యక్తం చేశాడు. అంతే కాకుండా కార్తి అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని అన్నాడు. సర్దార్ పార్ట్ 1 లో నీటి సమస్యను ప్రధాన అంశంగా చూపించినట్లే, సర్దార్ 2 లో మరింత పెద్దదైన సమస్యను చూపిస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందని అన్నాడు. సినిమాలోని ఆ పాయింట్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, అంతే కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అందం పట్టినట్లుగా కూడా ఉండి ప్రేక్షకులను అలరిస్తుంది అనే అభిప్రాయం ను సంగీత దర్శకుడు వ్యక్తం చేశాడు. దాంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. కార్తికి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో పడ్డట్లే అని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ సర్దార్ 2 ....
ఇటీవల సర్దార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం కార్తి చాలా కష్టపడ్డాడు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో కార్తికి జోడీగా మాళవిక మోహనన్, ఆశిక రంగనాథన్ నటించారు. ఇంకా సినిమాలో యోగి బాబు కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. తమిళ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ సెప్టెంబర్ 10న భారీ చిత్రాల విడుదల లేకపోవడం కలిసి వచ్చే అంశం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇరుముడి సినిమా సందడి చేస్తోంది. అయితే వచ్చే వారంకు కాస్త డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే సర్దార్ 2 కి కలిసి వచ్చే అంశం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్దార్ 2 తో కార్తి మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని యూనట్ సభ్యులు అంటున్నారు. హిట్ సినిమా సీక్వెల్ కనుక ఫలితం పై సహజంగానే పాజిటివ్ బజ్ ఉంది. మరి సర్దార్ 2 కి అది ఎంత వరకు కలిసి వచ్చేనో చూడాలి.