ఇండియన్ స్పై థ్రిల్లర్స్‌కు కొత్త పోటీ.. G2 ముందు భారీ సవాల్!

ఒకప్పుడు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ అంటే బాలీవుడ్‌కే ఎక్కువగా పరిమితమైన జానర్‌గా కనిపించేది. కానీ కాలం మారుతోంది.

Update: 2026-09-05 10:00 GMT

ఒకప్పుడు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ అంటే బాలీవుడ్‌కే ఎక్కువగా పరిమితమైన జానర్‌గా కనిపించేది. కానీ కాలం మారుతోంది. భారీ బడ్జెట్లు, ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్లు, సంక్లిష్టమైన కథలు, ఊహించని ట్విస్టులతో ఇప్పుడు స్పై థ్రిల్లర్లు దేశవ్యాప్తంగా ఆడియ‌న్స్ ను ఆకర్షించే పెద్ద మార్కెట్‌గా మారాయి. ఈ పోటీలో ఇప్పుడు తెలుగు నుంచి అడివి శేష్ నటిస్తున్న గూఢచారి2 కూడా అత్యంత కీలకమైన అడుగు వేయబోతోంది. గూఢచారి మొద‌టి భాగం కథ, స్క్రీన్‌ప్లే, అడివి శేష్ యాక్టింగ్‌తో ఆడియ‌న్స్ ను ఆకట్టుకుని తెలుగు సినిమాకు ఒక స్పెష‌ల్ స్పై థ్రిల్లర్‌ను అందించింది. ఇప్పుడ‌దే ఫ్రాంచైజీని మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేందుకు G2 రెడీ అవుతోంది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా స్కేల్ పరంగా మొదటి భాగాన్ని మించబోతుందనే అంచనాలు ఉన్నాయి.

అయితే ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతోంది. సీక్వెల్‌కు బడ్జెట్ పెంచడం, యాక్షన్‌ను భారీగా చూపించడం సుల‌భం అనుకోవ‌చ్చు. కానీ ఆడియ‌న్స్ అంచనాలను మోయడం మాత్రం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఫ‌స్ట్ పార్ట్ స‌క్సెస్ అయిన‌ప్పుడు, సెకండ్ పార్ట్ కేవలం భారీగా ఉండటం సరిపోదు.. మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలి. ఇక ఇటీవల ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ల స్థాయి మరింత పెరిగిన నేపథ్యంలో ధురంధర్ లాంటి సినిమాలు ఈ జానర్‌పై ఆడియ‌న్స్ ప్రేక్షకుల అంచనాలను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. ఇప్పుడు విజువల్స్, యాక్షన్ మాత్రమే కాదు.. కథలో కొత్తదనం, పాత్రల బలం, ట్విస్టులు, ఎమోషనల్ కనెక్ట్ అన్నీ బ్యాలెన్డ్స్‌గా ఉండాలని ఆడియ‌న్స్ కోరుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో G2 ముందున్న సవాల్ కేవలం మరో హిట్ అందుకోవడం మాత్రమే కాదు. తెలుగు సినిమా నుంచి ఇండియన్ స్పై థ్రిల్లర్ జానర్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడం. షూటింగ్ ఇంకా పూర్తికాకముందే సినిమాపై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ లు అంచనాలను పెంచుతున్నాయి. కానీ చివరికి గూఢచారి2 ఆ భారీ హైప్‌ను తట్టుకుని, పెరిగిన ప్రమాణాలకు తగ్గట్టుగా నిలబడుతుందా? ఇండియన్ స్పై థ్రిల్లర్స్ మధ్య కొత్త పోటీకి నాంది పలుకుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

ఈ పరిస్థితుల్లో G2 ముందున్న సవాల్ కేవలం మరో హిట్ అందుకోవడం మాత్రమే కాదు. తెలుగు సినిమా నుంచి ఇండియన్ స్పై థ్రిల్లర్ జానర్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడం. షూటింగ్ ఇంకా పూర్తికాకముందే సినిమాపై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ లు అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమా గురించి చెప్తున్న విష‌యాలు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. కానీ చివరికి గూఢచారి2 ఆ భారీ హైప్‌ను తట్టుకుని, పెరిగిన ప్రమాణాలకు తగ్గట్టుగా నిలబడుతుందా? ఇండియన్ స్పై థ్రిల్లర్స్ మధ్య కొత్త పోటీకి నాంది పలుకుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News